AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అలాంటి సినిమాలు ఆడవు అన్నారు.. కానీ నా సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది: దుల్కర్ సల్మాన్

మలయాళీ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ తన సొంత గడ్డపై సత్తా చాటాడు. దాదాపు మూడేళ్ల తర్వాత ఐ యామ్ గేమ్ సినిమాతో మలయళీ అడియన్స్ ముందుకు వచ్చాడు ఈ హీరో. 2023లో వచ్చిన కింగ్ ఆఫ్ కొత్త తర్వాత దుల్కర్ నటించిన ఈ మూవీ సెప్టెంబర్ 3 ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది.

అలాంటి సినిమాలు ఆడవు అన్నారు.. కానీ నా సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది: దుల్కర్ సల్మాన్
Dulquer Salmaan
Rajeev Rayala
|

Updated on: Sep 07, 2026 | 10:04 AM

Share

నటుడు దుల్కర్ సల్మాన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..తెలుగు ప్రజలు ఎప్పుడూ నన్ను ఆదరిస్తాని రాని అన్నారు. ఇప్పుడు ఐ యామ్ గేమ్ సినిమాను కూడా అలాఅంటే ఆదరిస్తారని అనుకుంటున్నా.. నేను గతంలో పీరియాడిక్ చిత్రాలు, విభిన్న జానర్‌లలో నటించాను. అయితే, ఈ స్థాయిలో డ్యాన్స్ చేయడం ఇదే మొదటిసారి అని సరదాగా అన్నారు. కొరియోగ్రాఫర్ శాండీ మాస్టర్‌తో కలిసి పని చేయడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. లఐ యామ్ గేమ్ సినిమా గురించి మాట్లాడుతూ.. జాన్ అనే పాత్ర గురించి మాట్లాడుతూ, “అతను తల్లిదండ్రులు కోరుకోని కొడుకులాంటి వాడు. కానీ, ఈ పాత్రను ప్రేక్షకులకు నచ్చేలా చేయడం నాకు ఒక సవాలుగా మారింది,” అని తెలిపారు. ఐ యామ్ గేమ్ ఒక కొత్త ప్రపంచాన్ని, ముఖ్యంగా జూదం, ఆర్థిక సంబంధమైన అంశాలను అన్వేషిస్తుందని దుల్కర్ వెల్లడించారు. తన ప్రతి చిత్రంలోనూ ఒక కొత్త ప్రపంచాన్ని ప్రేక్షకులకు పరిచయం చేయడమే తన లక్ష్యమని ఆయన చెప్పుకొచ్చారు. “కురూప్ ఒక కొత్త ప్రపంచం, కింగ్ ఆఫ్ కోత కూడా ఒక కొత్త ప్రపంచం. లక్కీ భాస్కర్, కాంత చిత్రాలు కూడా విభిన్న కథా ప్రపంచాలను అందించాయి. ఇది ప్రేక్షకులకు ఒక కనుల పండుగ,” అని ఆయన అన్నారు.

సీతారామం విజయం తనకు చాలా భావోద్వేగ అనుభూతిని ఇచ్చిందని దుల్కర్ గుర్తుచేసుకున్నారు. “లవ్ స్టోరీలు ఆ సమయంలో పెద్దగా వర్కౌట్ కావడం లేదు. కరణ్ జోహార్ వంటి వారు కూడా లవ్ స్టోరీ జానర్ చనిపోయిందని అన్నారు. కానీ, సీతారామం అనూహ్యంగా విజయం సాధించడం నాకు చాలా సంతోషాన్నిచ్చింది,” అని ఆయన వివరించారు. తన చిత్రాలు ప్రేక్షకుల అంచనాలను మించిపోవడం పట్ల ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

డబ్బును పెట్టుబడి పెట్టే విధానం గురించి అడిగినప్పుడు, దుల్కర్ “మెరిట్ ఆధారంగానే నేను పెట్టుబడి పెడతాను. స్నేహితులు, కుటుంబం పట్ల నాకు ప్రేమ ఉంది, సహాయం కూడా చేస్తాను. కానీ, పెట్టుబడి విషయానికి వస్తే, సామర్థ్యానికే ప్రాధాన్యత ఇస్తాను,” అని స్పష్టం చేశారు. ఒక ఐడియాపై బెట్ వేసినప్పుడు, అది అంచనాలను మించి విజయం సాధిస్తేనే అది విజయవంతమైన పెట్టుబడి అవుతుందని ఆయన అన్నారు. లక్కీ భాస్కర్ విషయంలో కూడా డైరెక్టర్ వెంకీని నమ్మి, ఆయన విజయాన్ని మించిన అవుట్‌పుట్‌ను ఇవ్వడంతో తన నమ్మకం నిజమైందని ఆయన పేర్కొన్నారు. నటుడిగా ఎప్పుడూ కొత్త ప్రపంచాలను అన్వేషించడానికి తాను సిద్ధంగా ఉంటానని దుల్కర్ సల్మాన్ చెప్పుకొచ్చారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us