AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pradeep Advaitham: ‘ఛాంపియన్’ దర్శకుడి ఇంట తీవ్ర విషాదం.. చిన్న వయసులోనే భార్య హఠాన్మరణం.. ఏమైందంటే?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో మరో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఛాంపియన్ లాంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ దర్శకుడు అద్వైతం ప్రదీప్ సతీమణి దీప్తి రెడ్డి మాడుగుల హఠాత్తుగా కన్నుమూశారు. దీంతో దర్శకుడి కుటుంబంలో తీవ్ర విషాధ చాయలు అలుముకున్నాయి.

Pradeep Advaitham: 'ఛాంపియన్' దర్శకుడి ఇంట తీవ్ర విషాదం.. చిన్న వయసులోనే భార్య హఠాన్మరణం.. ఏమైందంటే?
Pradeep Advaitham
Basha Shek
|

Updated on: Sep 27, 2026 | 9:15 AM

Share

ప్రముఖ దర్శకుడు ప్రదీప్ అద్వైతం ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆయన సతీమణి, ప్రముఖ వ్యాపార వేత్త దీప్తి రెడ్డి మాడుగుల హఠాత్తుగా కన్నుమూశారు. . గత కొద్ది రోజులుగా తీవ్రమైన ఆరోగ్య సమస్యతో బాధపడుతోన్న ఆమె శనివారం (సెప్టెంబర్ 27) సాయంత్రం తుదిశ్వాస విడిచారు. దీంతో దర్శకుడి తో పాటు అతని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. మరోవైపు దీప్తి రెడ్డి హఠాన్మరణంతో సినీ, వ్యాపార వర్గాలు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాయి. ఆమె ఆత్మకు శాంతి కలగాలంటూ నివాళి అర్పిస్తున్నారు. కాగా ఐదు రోజుల క్రితం దీప్తి రెడ్డి అకస్మాత్తుగా బ్రెయిన్ స్ట్రోక్‌కు గురయ్యారు. పరిస్థితి విషమంగా మారడంతో కుటుంబసభ్యులు వెంటనే ఆమెను గచ్చిబౌలిలోని కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రిలో నిపుణులైన వైద్య బృందం అత్యవసర శస్త్ర చికిత్స అందించి ఆమె ప్రాణాలు కాపాడేందుకు శతవిధాలా ప్రయత్నించారు. అయినా ఫలితం దక్కలేదు. శనివారం సాయంత్రం దీప్తి తుది శ్వాస విడిచినట్లు వైద్యులు ధ్రువీకరించారు. దీప్తి రెడ్డి అకాల మరణంతో ప్రదీప్ అద్వైతంతో పాటు వారి ఇద్దరు పిల్లలు శోకసంద్రంలో మునిగిపోయారు. ఆమె మరణవార్త తెలిసిన వెంటనే టాలీవుడ్ ప్రముఖులు, దర్శకులు, నిర్మాతలు ప్రదీప్ కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

అద్వైతం ప్రదీప్ విషయానికి వస్తే.. కెరీర్ ప్రారంభంలో ఆయన తెరకెక్కించిన ‘అద్వైతం’ షార్ట్ ఫిల్మ్ జాతీయ స్థాయిలో ఉత్తమ చిత్రంగా నిలిచింది. ఆ గుర్తింపుతోనే ‘ప్రదీప్ అద్వైతం’గా స్థిరపడ్డారు. ఇక ‘బిల్లా రంగా’, ‘మైనే ప్యార్ కియా’ వంటి సినిమాలతో సిల్వర్ స్క్రీన్ పైనా సత్తా చాటారు ప్రదీప్ రెడ్డి. ముఖ్యంగా వైజయంతీ మూవీస్ వంటి అగ్ర సంస్థలో శ్రీకాంత్ కుమారుడు రోషన్ తో ప్రదీప్ తెరకెక్కించిన ఛాంపియన్ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. పీరియాడికల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకుల మన్ననలతో పాటు సినీ విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది. ఇక ప్రదీప్ భార్య దీప్తి రెడ్డి వ్యాపార రంగంలో సత్తా చాటుతూ విజయవంతమైన మహిళా పారిశ్రామికవేత్తగా గుర్తింపు తెచ్చుకున్నారు. కాగా ఆదివారం (సెప్టెంబర్ 27) హైదరాబాద్ ఫిల్మ్ నగర్‌లోని మహాప్రస్థానంలో ఆదివారం దీప్తి రెడ్డి అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవగాహన కోసం 'పింక్ పవర్ రన్ 3.0'..
బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవగాహన కోసం 'పింక్ పవర్ రన్ 3.0'..
వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు
వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు
వైసీపీ ఓటమికి అవే కారణం.. TV9 క్రాస్‌ఫైర్‌లో ధర్మాన ప్రస్తాదరావు
వైసీపీ ఓటమికి అవే కారణం.. TV9 క్రాస్‌ఫైర్‌లో ధర్మాన ప్రస్తాదరావు
జగన్ పూర్తి చేసిన వాటికి ఇప్పుడు రిబ్బన్ కట్ చేస్తున్నారు
జగన్ పూర్తి చేసిన వాటికి ఇప్పుడు రిబ్బన్ కట్ చేస్తున్నారు
Tv9 క్రాస్‌ఫైర్‌లో మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ కీలక వ్యాఖ్యలు!
Tv9 క్రాస్‌ఫైర్‌లో మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ కీలక వ్యాఖ్యలు!
అనుమాన పక్షి మూవీ రివ్యూ.. రాగ్‌ మయూర్‌ కామెడీ అదుర్స్‌!
అనుమాన పక్షి మూవీ రివ్యూ.. రాగ్‌ మయూర్‌ కామెడీ అదుర్స్‌!
'నన్ను అవమానించినా ఫర్వాలేదు.. ట్రోలర్స్‌కు ఎమోషనల్ మెసేజ్
'నన్ను అవమానించినా ఫర్వాలేదు.. ట్రోలర్స్‌కు ఎమోషనల్ మెసేజ్
‘ప్యారడైజ్‌’ టాక్‌తో చిరు-శ్రీకాంత్‌ మూవీకి బ్రేక్‌ పడుతుందా?
‘ప్యారడైజ్‌’ టాక్‌తో చిరు-శ్రీకాంత్‌ మూవీకి బ్రేక్‌ పడుతుందా?
400 కోట్ల వైపు పరుగులు.. చిన్న సినిమాకు షాకింగ్ కలెక్షన్స్
400 కోట్ల వైపు పరుగులు.. చిన్న సినిమాకు షాకింగ్ కలెక్షన్స్
నాని సినిమా ముందర.. భారీ బ్రేక్ ఈవెన్ టార్గెట్?
నాని సినిమా ముందర.. భారీ బ్రేక్ ఈవెన్ టార్గెట్?