
నిన్న మొన్నటివరకు లవర్ బాయ్ గా ఉన్న నాని దసరా సినిమాతో మాస్ హీరోగా మారిపోయాడు. మాస్ మసాలా ఎంటర్టైనర్ గా తెరకెక్కిన దసరా సినిమా మంచి విజయం సాధించింది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కీర్తిసురేష్ హీరోయిన్ నటించింది. నాని నటన ఈ సినిమాలో నెక్స్ట్ లెవల్ అనే చెప్పాలి. ఇక ఇప్పుడు నాని 31 త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు సంబంధించిన గ్లింమ్ప్స్ ప్ర్క్షకులను ఆకట్టుకుంది. చూస్తుంటే ఈ మూవీ తండ్రి కూతురికి మధ్య జరిగే ఎమోషనల్ జర్నీలా కనిపిస్తుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా మృణాల్ ఠాకూర్ నటిస్తుంది. అలాగే మరో హీరోయిన్ గా శ్రుతిహాసన్ కనిపించనుందని తెలుస్తోంది. ఈ మూవీలో శ్రుతి నాని భార్యగా నటించనుందట. ఇదిలా ఉంటే నాని ఈ సినిమా తర్వాత మరో ఇంట్రెస్టింగ్ మూవీతో అలరించడానికి రెడీగా ఉన్నారని తెలుస్తోంది.
దసరా కంటే ముందు నాని అంటే సుందరానికి అనే సినిమా చేశారు. ఈ సినిమాకు వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయింది. మంచి కంటెంట్ తో సినిమాలు తెరకెక్కించే వివేక్ అంటే సుందరానికి విషయంలో తడబడ్డారు. ఇప్పుడు మరోసారి నానితో సినిమా చేయనున్నాడట.
ఈసారి ఓ డార్క్ థ్రిల్లర్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడట. ఇప్పటికే నానికి లైనప్ వినిపించాడట వివేక్. కథ నచ్చడంతో నాని ఓకే చేశారని తెలుస్తోంది. ఇప్పటివరకు డార్క్ థ్రిల్లర్ నేపథ్యంలో వచ్చిన సినిమాలన్నీ ప్రేక్షకులను మెప్పించాయి. ఇప్పుడు నాని, వివేక్ కూడా అదే కాన్సెప్ట్ తో ఇప్పుడు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారట.