అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య సాలిడ్ హిట్ కొట్టి చాలా కాలం అయ్యింది. శేకర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన లవ్ స్టోరీ సినిమాతో హిట్ అందుకున్నాడు నాగ చైతన్య. ఆతర్వాత మరో హిట్ ఈ యంగ్ హీరో ఖాతలో పడలేదు. చివరిగా కస్టడీ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు చైతూ.. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఆతర్వాత ఇప్పుడు మరో సినిమా విషయంలో చిన్న గ్యాప్ తీసుకున్నాడు చై.. పరశురామ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయాల్సి ఉండగా ఆ సినిమా ఆగిపోయింది. ఈ సినిమా ఎప్పుడో అనౌన్స్ అయినప్పటికీ.. అప్పుడు మహేష్ బాబు నుంచి ఆఫర్ రావడంతో చైతు సినిమాకు బ్రేక్ పడింది. ఇక ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు చైతన్య.
రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నాగ చైతన్య సినిమా చేయనున్నారని తెలుస్తోంది. ఇటీవలే రామ్ అబ్బరాజు సామజవరగమన అనే సినిమాతో హిట్ అందుకున్నాడు. శ్రీవిష్ణు హీరోగా తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. చాలా కాలం తర్వాత శ్రీ విష్ణు ఈ సినిమాతో హిట్ అందుకున్నాడు.
రామ్ అబ్బరాజు ఇప్పుడు నాగ చైతన్య కోసం ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ను సిద్ధం చేస్తున్నాడని తెలుస్తోంది. సునీల్ నారంగ్ ఈసినిమాను నిర్మిస్తున్నారని టాక్. ఈ సినిమా కూడా కామెడీ ప్రధానంగా సాగుతుందని తెలుస్తోంది. త్వరలోనే దీని పై క్లారిటీ రానుంది. అలాగే నాగ చైతన్య ఓ వెబ్ సిరీస్ లోనూ నటిస్తున్న విషయం తెలిసిందే. దూత అనే టైటిల్ తో ఈ సిరీస్ తెరకెక్కుతోంది.