Thala MS Dhoni : ఇంతకు విజయ్ గోట్‌ మూవీలో ధోని ఉన్నాడా..? క్లారిటీ ఇచ్చిన దర్శకుడు

|

Sep 04, 2024 | 1:34 PM

దళపతి విజయ్ లేటెస్ట్ మూవీ గోట్. 'గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్స్' అనేది దాని ఫుల్ ఫామ్. ఈ సినిమాలో ఎంఎస్ ధోనీ కూడా కనిపిస్తాడని దర్శకుడు వెంకట్ ప్రభు వెల్లడించారు. దాంతో ధోనీని పెద్ద తెరపై చూడాలని అభిమానులు ఎదురుచూస్తున్నారు.

Thala MS Dhoni : ఇంతకు విజయ్ గోట్‌ మూవీలో ధోని ఉన్నాడా..? క్లారిటీ ఇచ్చిన దర్శకుడు
Goat
Follow us on

క్రికెటర్, టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ గురించి, ఆయన ఫాలోయింగ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఇటీవలే ఆయన చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఓ భారీ బడ్జెట్ సినిమాలో ధోని నటిస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఈ విషయం గురించి ఆ చిత్ర దర్శకుడే స్వయంగా వెల్లడించడం ఇక్కడ గమనించాల్సిన విషయం. ఇంతకీ ఆ సినిమా ఏంటి.? ఈ సినిమాలో ఎవరు నటిస్తున్నారు? అనేది చూద్దాం.! దళపతి విజయ్ లేటెస్ట్ మూవీ గోట్. ‘గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్స్’ అనేది దాని ఫుల్ ఫామ్. ఈ సినిమాలో ఎంఎస్ ధోనీ కూడా కనిపిస్తాడని దర్శకుడు వెంకట్ ప్రభు వెల్లడించారు. దాంతో ధోనీని పెద్ద తెరపై చూడాలని అభిమానులు ఎదురుచూస్తున్నారు.

ఎంఎస్ ధోనీకి తమిళ చిత్ర పరిశ్రమతో మంచి అనుబంధం ఉన్న సంగతి తెలిసిందే. ధోని చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్‌గా చేశారు. అలా తమిళనాడుకు దగ్గరయ్యారు. అందుకే ఆయన నిర్మించిన తొలి సినిమా తమిళంలోనే కావడం విశేషం. ‘గోట్’ సినిమాలో చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ సీన్ ఉంది. ఈ కారణంగానే ధోనీ అతిధి పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది.

ముందుగా మాట్లాడిన వెంకట్ ప్రభు.. ‘సినిమా చివర్లో సీఎస్‌కే మ్యాచ్‌ సన్నివేశం ఉంటుంది. అక్కడ ఎవరు కనిపిస్తారో మళ్లీ చెప్పాల్సిన పని లేదు’ అని అన్నాడు. దీంతో ధోనీ నటిస్తాడని అంతా భావించారు. తర్వాత తన స్టేట్‌మెంట్‌ మార్చుకున్నాడు. సినిమాలో క్రికెట్ సీన్ ఉంటుంది. ఇందుకోసం ధోనీని తీసుకురావాలని ప్లాన్ చేశారు. కానీ, తర్వాత రద్దు చేసుకున్నారు’ అని దర్శకుడు తెలిపారు.దాంతో అభిమానులు డైలమాలో పడ్డారు. ఇంతకూ ధోని సినిమాలో ఉన్నడా.? లేడా.? అని సోషల్ మీడియా వేదికగా మేకర్స్ ను ప్రశ్నిస్తున్నారు ఫ్యాన్స్. గోట్ మూవీ తమిళ భారీ బడ్జెట్ చిత్రం. ఇందులో దళపతి విజయ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. విజయ్ ఈ మూవీలో తండ్రీకొడుకుల పాత్రలో కనిపించనున్నారు. గతంలో ‘బిగిల్’ సినిమాలో తండ్రీకొడుకుల పాత్రలో కనిపించారు విజయ్. ప్రభుదేవ్, స్నేహ, లైలా, జయరామ్, యోగిబాబు ఈ చిత్రంలో నటించారు. ఈ సినిమా రేపు( గురువారం) గ్రాండ్ గా విడుదలవుతోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి