AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vaishnav Tej: మెగా ఫ్యామిలీలోకి మరో హీరోయిన్.. వైష్ణవ్ పెళ్లాడేది ఆమెనేనా.. ?

సెలబ్రెటీలకు సంబందించిన విషయాలు నెట్టింట నిత్యం వైరల్ అవుతూ ఉంటాయి. సెలబ్రెటీల సినిమా విషయాలతో పాటు వారి వ్యక్తిగత విషయాలు కూడా నిత్యం నెట్టింట చక్కర్లు కొడుతూ ఉంటాయి. ఇక సినిమా వాళ్ళ పెళ్లి న్యూస్‌ల గురించి చెప్పాల్సిన అవసరం లేదు.

Vaishnav Tej: మెగా ఫ్యామిలీలోకి మరో హీరోయిన్.. వైష్ణవ్ పెళ్లాడేది ఆమెనేనా.. ?
Vaishnav Tej
Rajeev Rayala
|

Updated on: Nov 09, 2024 | 9:13 AM

Share

మెగా ఫ్యామిలీలోకి మరో హీరోయిన్ రాబోతోందా.? ఇప్పుడు ఇదే టాపిక్ సోషల్ మీడియాలో అటు ఫిలిం నగర్‌లో తెగ చక్కర్లు కొడుతోంది. సెలబ్రెటీలకు సంబందించిన విషయాలు నెట్టింట నిత్యం వైరల్ అవుతూ ఉంటాయి. సెలబ్రెటీల సినిమా విషయాలతో పాటు వారి వ్యక్తిగత విషయాలు కూడా నిత్యం నెట్టింట చక్కర్లు కొడుతూ ఉంటాయి. ఇక సినిమా వాళ్ళ పెళ్లి న్యూస్‌ల గురించి చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా మెగా ఫ్యామిలి హీరో గురించిన న్యూస్ ఒకటి వైరల్ అవుతుంది. ఆ హీరో ఎవరో కాదు వైష్ణవ్ తేజ్. సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఉప్పెన సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు వైష్ణవ్ తేజ్. తొలి సినిమాతోనే భారీ హిట్ అందుకున్నాడు.

ఇది కూడా చదవండి : జర్నీ సినిమాలో నటించిన ఈ అమ్మాయి గుర్తుందా..? ఆమె ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..

ఉప్పెన సినిమా వందకోట్ల వరకు వసూల్ చేసి నయా రికార్డ్ క్రియేట్ చేసింది. ఆ సినిమా తర్వాత వరుసగా సినిమాలు చేశాడు వైష్ణవ్ కానీ ఆ సినిమాలు ఏవీ అంతగా హిట్ అవ్వలేదు. ఉప్పెన సినిమా కంటే ముందు చైల్డ్ ఆర్టిస్ట్ గా కొన్ని సినిమాలు చేశాడు వైష్ణవ్. జానీ, శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్, అందరివాడు సినిమాల్లో నటించాడు. ఇక ఉప్పెన తర్వాత కొండపొలం, రంగ రంగ వైభవంగా, ఆదికేశవ సినిమాలు చేశాడు. కానీ ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తాకొట్టాయి.

ఇది కూడా చదవండి : మావా.. ఎవరో గుర్తుపట్టావా.? అప్పట్లో ఊపేసిన శాంతాబాయి.. ఇప్పుడు ఎలా ఉందంటే

ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ యంగ్ హీరో పెళ్లి గురించిన ఆసక్తికర కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఓ హీరోయిన్ తో వైష్ణవ్ డేటింగ్ చేస్తున్నాడంటూ రూమర్స్ వినిపిస్తున్నాయి. ఆ హీరోయిన్ ఎవరో కాదు ఆమె అందాల భామ రీతువర్మ. లావణ్య, వరుణ్ తేజ్ పెళ్ళిలో రీతూ వర్మ సందడి చేసింది. అలాగే మెగా ఫ్యామిలీ ఫోటోలోనూ రీతూ వర్మ కనిపించింది. దాంతో వైష్ణవ్, రీతూ వర్మ ప్రేమలో ఉన్నారంటూ వార్తలు వచ్చాయి. ఈ ఇద్దరూ డేటింగ్ లో ఉన్నారంటూ.. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు వచ్చాయి. అయితే దీని పై వైష్ణవ్ క్లారిటీ ఇచ్చారు. రీతూ లావణ్య బెస్ట్ ఫ్రెండ్ అని అంతకు మించి ఏమీ లేదు అని చెప్పాడు. అయితే లావణ్య, వరుణ్ కూడా తమ ప్రేమను చాలా సీక్రెట్ గా ఉంచారు. అలాగే వైష్ణవ్, రీతూ వర్మ కూడా తమ ప్రేమ గురించి బయట పెట్టడం లేదు అని అంటున్నారు కొందరు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.