బిగ్ బాస్ సీజన్ 6 చివరి అంకానికి చేరుకుంటుంది. త్వరలోనే ఈ సీజన్ ముగుస్తుంది. ఈ క్రమంలో టాప్ 5లో ఎవరు ఉంటారన్నది ఆసక్తికరంగా మారింది. అయితే ఈ సీజన్ లో ఊహించని ఎలిమినేషన్స్ ప్రేక్షకులను టెన్షన్ లో పడేస్తున్నాయి. ఇప్పటికే చాలా మంది హౌస్ నుంచి బయటకు వచ్చేశారు. టాప్ 5లో ఉంటారన్న వాళ్ళు చాలా మంది ఎలిమినేట్ అయ్యి హౌస్ నుంచి వచ్చేశారు. ఇక ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ నుంచి ఎవరు బయటకు వచేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. అయితే ఈవారం కూడా ఊహించని ఎలిమినేషన్ జరగనుందని తెలుస్తోంది. హౌస్ నుంచి శ్రీ సత్య బయటకు వస్తుందని అనుకుంటే కనే ఏ ఆమె సేఫ్ అయ్యిందని తెలుస్తోంది. ఆమె ప్లేస్ లో మరో కంటెస్టెంట్ బయటకు వచ్చేస్తుందని తెలుస్తోంది. ఆమె ఎవరో కాదు మెరీనా.
బిగ్ బాస్ సీజన్ 6లో మెరీనా రోహిత్ ఇద్దరు జంటగా వచ్చిన విషయం తెలిసిందే. మొదట్లో ఈ ఇద్దరు కలిసి ఆడారు. కానీ ఇప్పుడు ఎవరి గేమ్ వాళ్లు ఆడుతున్నారు. అయితే మొదట్లో మెరీనా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయిందన్న టాక్ గట్టిగా వినిపించింది. కానీ ఇప్పుడు ఆమె కావాల్సినంత ఫుట్ఠేజ్ ఇస్తుంది.
అయినా కూడా మెరీనా ఎలిమినేట్ అయి హౌస్ నుంచి బయటకు వచేసిందని తెలుస్తోంది. రోహిత్-మెరీనాలు జంటగా వచ్చారు. 11 వారాలు పాటు ఈ భార్యభర్తలు జంటగానే గేమ్ ఆడారు. అయితే ఈవారంలో ఇద్దరూ నామినేషన్స్‌లో ఉండటంతో ఓటింగ్ శాతం షేర్ అయ్యింది. అయితే ఈ వారం నామినేషన్ లో శ్రీ సత్యకు, మెరీనాకు ఇద్దరికీ మధ్య గట్టి పోటీ జరిగిందని తెలుస్తోంది. వీరిలో శ్రీ సత్య హౌస్‌లో ఉండాల్సిందే అన్న ఆలోచనలో బిగ్ బాస్ నిర్వాహకులు ఆమెను ఈవారం ఎలిమినేషన్ నుంచి సేవ్ చేశారనే టాక్ వినిపిస్తుంది. చూడాలి మరి ఏంజరుగుతుందో..