Vijay Deverakonda: విజయ్ దేవరకొండ ఆ హీరో డైరెక్షన్‌లో సినిమా చేయనున్నాడా..?

|

Mar 16, 2023 | 9:42 PM

లేటెస్ట్ గా ఆయన యాక్టింగ్‌ గురించి కాకపోయినా, డైరక్షన్‌ పరంగా టాలీవుడ్‌లో టాప్‌ హీరో కాంబోలో మూవీ అంటూ మాటలు వినిపిస్తున్నాయి.

Vijay Deverakonda: విజయ్ దేవరకొండ ఆ హీరో డైరెక్షన్‌లో సినిమా చేయనున్నాడా..?
Vijay Devarakonda
Follow us on

డివైన్‌ బ్లాక్‌ బస్టర్‌ కాంతార సినిమా రిలీజ్‌ అయి, బాక్సాఫీస్‌ దగ్గర బొంబాట్‌ చేసినప్పటి నుంచీ రిషబ్‌ శెట్టి మీద స్పెషల్‌ ఫోకస్‌ ఉంది జనాలకు. అందుకే ఏ ఇండస్ట్రీలో సినిమా స్టార్ట్ అయినా రిషబ్‌ అందులో నటిస్తున్నారనే మాటలు వినిపిస్తున్నాయి. లేటెస్ట్ గా ఆయన యాక్టింగ్‌ గురించి కాకపోయినా, డైరక్షన్‌ పరంగా టాలీవుడ్‌లో టాప్‌ హీరో కాంబోలో మూవీ అంటూ మాటలు వినిపిస్తున్నాయి.

లైగర్‌తో ప్యాన్‌ ఇండియాను టార్గెట్‌ చేశారు విజయ్‌ దేవరకొండ. ఆ సినిమా కోసం రేయింబవళ్లు కష్టపడి ఫిజిక్‌ మెయింటెయిన్‌ చేయడమే కాదు, ప్రాణం పెట్టి పబ్లిసిటీ కూడా చేశారు. విజయ్‌ పెర్ఫార్మెన్స్ కి ఫుల్‌ మార్కులు పడ్డాయి. కానీ, కంటెంట్‌లో సత్తా లేకపోవడంతో బాక్సాఫీస్‌ దగ్గర ఫెయిల్యూర్‌ని టేస్ట్ చేసింది లైగర్‌. ప్రస్తుతం పూర్తి కాన్‌సెన్‌ట్రేషన్‌ ఖుషీ మీదు ఉంది విజయ్‌ దేవరకొండకు. సమంత హెల్త్ ఇష్యూస్‌ వల్ల ఖుషీ షూటింగ్‌ ఆ మధ్య వాయిదా పడింది. ఇప్పుడు మళ్లీ సెట్స్ మీదకు చేరుకున్నారు యూనిట్‌ మెంబర్స్. ఇంతలోనే కాంతార డైరక్టర్‌ రిషబ్‌ శెట్టితో విజయ్‌ మూవీ అంటూ వార్తలు వైరల్‌ అవుతున్నాయి.

ఆల్రెడీ మలయాళంలో మోహన్‌లాల్‌ సినిమాలో నటిస్తున్నారంటూ రిషబ్‌ శెట్టి పేరు వినిపించింది. అయితే ప్రస్తుతం కాంతారా 2 పనులతో బిజీగా ఉండటం వల్ల, మరో ప్రాజెక్టులో నటించడం సాధ్యం కాదని వివరించారు రిషబ్‌. మరి ప్రస్తుతం వైరల్‌ అవుతున్న విజయ్‌ దేవరకొండ మూవీ గురించి ఎలా స్పందిస్తారో చూడాలి? అన్నీ పర్ఫెక్ట్ గా కుదిరి రిషబ్‌ డైరక్షన్‌లో విజయ్‌ మూవీ చేస్తే మాత్రం, వైవిధ్యమైన కంటెంట్‌ని ఎక్స్ పెక్ట్ చేయొచ్చన్నది క్రిటిక్స్ మాట.