AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cinema: ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన కథతో మహేష్ బాబు సినిమా.. కట్ చేస్తే అల్ట్రా డిజాస్టర్.. ఏ మూవీనో తెలుసా?

ఒక హీరో చేయాల్సిన సినిమా వివిధ కారణాలతో వేరు హీరో చేయడం ఇండస్ట్రీలో సర్వసాధారణమే. అలా ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన ఒక కథతో మహేష్ బాబు సినిమా చేశాడు.. కట్ చేస్తే.. ఆ సినిమా సూపర్ స్టార్ కెరీర్ లోనే అల్ట్రా డిజాస్టర్ గా నిలిచింది.

Cinema: ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన కథతో మహేష్ బాబు సినిమా.. కట్ చేస్తే అల్ట్రా డిజాస్టర్.. ఏ మూవీనో తెలుసా?
Mahesh Babu, Jr Ntr
Basha Shek
|

Updated on: May 07, 2026 | 6:28 PM

Share

సాధారణంగా సినిమా కథల ఎంపికలో హీరోలు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. డైరెక్టర్ చెప్పిన కథ సూట్ అవుతుందా? అభిమానులకు నచ్చుతుందా? ఇలా చాలా సమీకరణాలను పరిగణనలోకి తీసుకుంటారు. అయితే ఒక్కోసారి స్టార్ హీరోల అంచనాలు కూడా తారుమారు అవుతుంటాయి. ఎన్నో అంచనాలు, ఆశలతో చేసిన సినిమాలు కూడా అనూహ్యంగా బోల్తా పడుతుంటాయి. అలా గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన ఒక సినిమా మహేష్ బాబు దగ్గరకు వెళ్లింది. అప్పటికే ఆ డైరెక్టర్ తనకు ఓ బ్లాక్ బస్టర్ ఇవ్వడంతో మహేష్ చాలా నమ్మకంతో యాక్సెప్ట్ చేశాడు. స్టోరీ లైన్ కూడా ఇంట్రెస్ట్ గా ఉండడం, ఫ్యామిలీ ఎలిమెంట్స్ కూడా పుష్కలంగా ఉండడంతో భారీ అంచనాలతో సినిమా చేశాడు మహేష్.. కట్ చేస్తే.. ఆ సినిమా సూపర్ స్టార్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఫ్లాప్‌లలో ఒకటిగా నిలిచింది. ఇప్పటికీ మహేష్ అభిమానులు మర్చిపోలేదు. నిజం చెప్పాలంటే.. ఆ సినిమా మహేష్ బాబు సినిమా కెరీర్ లోనే ఒక పీడకల అని చెప్పుకోవచ్చు. మహేష్ అభిమానులను వణికించిన ఆ అల్ట్రా డిజాస్టర్ మూవీ మరేదో కాదు బ్రహ్మోత్సవం.

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టుతో మహేష్ బాబుకు మంచి ఫ్యామిలీ హిట్ ఇచ్చాడు శ్రీకాంత్ అడ్డాల. దీంతో తన నెక్స్ట్ సినిమా బ్రహ్మోత్సవం కూడా మహేష్ బాబు తోనే చెశాడీ డైరెక్టర్. రిలీజ్ కు ముందు ఈ మూవీపై ఉన్న అంచనాలు అన్నీ ఇన్నీ కావు. కానీ తీరా రిలీజయ్యాక మాత్రం అసలు మహేష్ ఈ సినిమా ఎందుకు చేశాడ్రా? అని అభిమానులు ఫీలయ్యారు. అయితే ఈ బ్రహ్మోత్సవం సినిమాకు హీరోగా ఫస్ట్ ఛాయిస్ మహేష్ కాదట. ఈ సినిమా కథ ముందుగా శ్రీకాంత్ అడ్డాల ఎన్టీఆర్‌కు చెప్పారట. ఎన్టీఆర్ కు కూడా ఈ స్టోరీ లైన్ తెగ నచ్చేసిందట. అయితే కొన్ని మార్పులు చేయమన్నారట. అందుకు తగ్గట్టుగానే శ్రీకాంత్ అడ్డాల కొత్త వెర్షన్ రెడీ చేసుకుని ఎన్టీఆర్ దగ్గరకు వెళ్లాడట. అయితే కొత్త వెర్షన్‌ కూడా ఎన్టీఆర్‌ను మెప్పించలేకపోయిందట. దీనికి తోడు అప్పటికే తారక్ వరుస ఫ్లాపులతో సతమవుతున్నాడు. దీంతో రిస్క్ చేయడం ఎందుకుని బ్రహ్మోత్సవం సినిమాను పట్టించుకోలేదట. దీంతో శ్రీకాంత్ అడ్డాల ఇదే కథను మహేష్ కు చెప్పి ఒప్పించాడట. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఈ సినిమా అల్ట్రా డిజాస్టర్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద కనీస వసూళ్లు కూడా రాబట్టలేక నిర్మాతలకు భారీ నష్టాలను మిగిల్చింది బ్రహ్మోత్సవం.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
2027 వన్డే వరల్డ్ కప్‌లో రోహిత్, కోహ్లీ ఆడటం ఖాయం.. గిల్ క్లారిటీ
2027 వన్డే వరల్డ్ కప్‌లో రోహిత్, కోహ్లీ ఆడటం ఖాయం.. గిల్ క్లారిటీ
మొదటి భర్తకు విడాకులు ఇవ్వకుండా రెండో పెళ్లి చేసుకుంటే మహిళకు..
మొదటి భర్తకు విడాకులు ఇవ్వకుండా రెండో పెళ్లి చేసుకుంటే మహిళకు..
పండు మాస్టర్‌ను పరామర్శించిన శేఖర్ మాస్టర్.. ఇప్పుడెలా ఉన్నాడంటే?
పండు మాస్టర్‌ను పరామర్శించిన శేఖర్ మాస్టర్.. ఇప్పుడెలా ఉన్నాడంటే?
కొత్త జంటలకు స్వర్గధామం..ఇండియన్స్ మెచ్చే రొమాంటిక్ డెస్టినేషన్
కొత్త జంటలకు స్వర్గధామం..ఇండియన్స్ మెచ్చే రొమాంటిక్ డెస్టినేషన్
రుచి చూడాల్సిందే.. హైదరాబాద్ స్టైల్‌లో చికెన్ మెజిస్టిక్స్
రుచి చూడాల్సిందే.. హైదరాబాద్ స్టైల్‌లో చికెన్ మెజిస్టిక్స్
ఓటీటీ కంటెంట్‌కు సెన్సార్‌ నిబంధనలు తెచ్చే ఆలోచనలో కేంద్రం
ఓటీటీ కంటెంట్‌కు సెన్సార్‌ నిబంధనలు తెచ్చే ఆలోచనలో కేంద్రం
ఓటీటీలో సస్పెన్స్ థ్రిల్లర్ రచ్చ .. అస్సలు మిస్ అవ్వకండి..
ఓటీటీలో సస్పెన్స్ థ్రిల్లర్ రచ్చ .. అస్సలు మిస్ అవ్వకండి..
ఓటీటీ హవాకు చెక్.. కమర్షియల్ సినిమాలతో థియేటర్లలో మళ్లీ జాతర!
ఓటీటీ హవాకు చెక్.. కమర్షియల్ సినిమాలతో థియేటర్లలో మళ్లీ జాతర!
ట్రైలర్‌ రిలీజ్‌కు రెడీ... టెన్షన్‌లో రామాయణ టీమ్‌..
ట్రైలర్‌ రిలీజ్‌కు రెడీ... టెన్షన్‌లో రామాయణ టీమ్‌..
లంచ్ బ్యాగ్ నుండి మొండి మరకలు,దుర్వాసనలను వదిలించే సింపుల్ టిప్స్
లంచ్ బ్యాగ్ నుండి మొండి మరకలు,దుర్వాసనలను వదిలించే సింపుల్ టిప్స్