Vinay Rai: హనుమాన్ విలన్ లవర్‌ను చూశారా.? హాట్ బ్యూటీతో డేటింగ్ చేస్తోన్న వినయ్ రాయ్

|

Aug 22, 2024 | 7:07 PM

హీరోగా తన తన నటనతో ప్రేక్షకులను మెప్పించారు. ఈ టాలెంటెడ్ యాక్టర్ ఇప్పుడు విలన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు. వినయ్ రాయ్ రీసెంట్ గా హనుమాన్ సినిమాలో విలన్‌గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రశాంత్ వర్మ దర్శకత్వం హనుమాన్ సినిమాలో తేజ సజ్జ హీరో గా నటించాడు. ఈ సినిమాలో విలన్ గా అద్భుతంగా నటించాడు వినయ్ రాయ్.

Vinay Rai: హనుమాన్ విలన్ లవర్‌ను చూశారా.? హాట్ బ్యూటీతో డేటింగ్ చేస్తోన్న వినయ్ రాయ్
Vinay Rai
Follow us on

ఒకప్పుడు హీరోగా ఆకట్టుకున్న చాలా మంది ఇప్పుడు విలన్స్ గా రాణిస్తున్నారు. జగపతి బాబులాంటి సీనియర్ హీరోలతో  యంగ్ హీరోలు ఆది పినిశెట్టి, కార్తికేయ లాంటి వాళ్ళు కూడా విలన్‌గా సినిమాలు చేస్తున్నారు. ఇలాంటి వారిలో వినయ్ రాయ్ ఒకరు. హీరోగా తన తన నటనతో ప్రేక్షకులను మెప్పించారు. ఈ టాలెంటెడ్ యాక్టర్ ఇప్పుడు విలన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు. వినయ్ రాయ్ రీసెంట్ గా హనుమాన్ సినిమాలో విలన్‌గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రశాంత్ వర్మ దర్శకత్వం హనుమాన్ సినిమాలో తేజ సజ్జ హీరో గా నటించాడు. ఈ సినిమాలో విలన్ గా అద్భుతంగా నటించాడు వినయ్ రాయ్. ఈ సినిమాలో స్టైలిష్ విలన్ గా వినయ్ రాయ్‌కు మంచి గుర్తింపు వచ్చింది. ఇక వినయ్ రాయ్ హీరోగా ఎన్నో సినిమాల్లో నటించాడు.

ఇది కూడా చదవండి : Lakshmi Manchu: నన్ను కూడా వదల్లేదు.. ఇండస్ట్రీలో లైంగిక వేధింపుల పై మంచు లక్ష్మీ షాకింగ్ కామెంట్స్

2007లో వచ్చిన నీవల్లే నీవల్లే అనే సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. ఈ సినిమా తెలుగు, తమిళ్ భాషల్లో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత తెలుగులో వాన సినిమాలో నటించాడు. ఈ సినిమాకు ఏంఎస్ రాజు దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో పాటలు సూపర్ హిట్ అయ్యాయి. అలాగే వినయ్ నటన కూడా మెప్పించింది. ఆ తర్వాత తమిళ్‌లోనే వరుసగా సినిమాలు చేశాడు.

ఇది కూడా చదవండి : Prabhas : మా ప్రభాస్‌నే అంటావా.. బాలీవుడ్ నటుడి గాలి తీసేసిన హీరో నాని

తమిళ్‌లో వరుణ్‌ డాక్టర్‌ అనే సినిమాలో విలన్ గా నటించి మెప్పించారు. వరుణ్‌ డాక్టర్‌ సినిమా తెలుగులోనూ మంచి విజయాన్ని అందుకుంది. ఇక రీసెంట్ గా హనుమాన్ సినిమాతో హిట్ అందుకున్నాడు. ఈ సినిమాలో నెగిటివ్ పాత్రలో నటించి మెప్పించారు. వినయ్ డేటింగ్ చేస్తోన్న హీరోయిన్ ఎవరో తెలుసా.? ఆమె విమలా రామన్. ఈ క్రేజీ బ్యూటీతో డేటింగ్ చేస్తున్నాడని తెలుస్తోంది. విమలా రామన్ చాలా సినిమాల్లో హీరోయిన్ గా నటించి ప్రేక్షకులను మెప్పించింది. మలయాళంలో ఎన్నో సినిమాలు చేసింది ఈ బ్యూటీ. ఎవరైనా ఎప్పుడేనా, జగపతి బాబుతో ‘గాయం’2, శ్రీకాంత్ తో రంగ ది దొంగ, తరుణ్ తో చుక్కలాంటి అమ్మాయి వంటి సినిమాలు చేసింది. ఇక వినయ్ , విమలారామన్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

ఇది కూడా చదవండి : Brahmamudi : సీరియల్‌లో పద్దతిగా.. బయట మాత్రం బికినీలో బీభత్సం

విమలా రామన్ ఇన్ స్టా..

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి.