Nani : స్పీడ్ పెంచిన నాని.. ఆ క్రేజీ దర్శకుడితో నేచురల్ స్టార్ సినిమా చేయనున్నాడా..

|

May 27, 2023 | 3:30 PM

మునుపెన్నడూ కనిపించని ఊర మాస్ పాత్రలో నాని నటించి మెప్పించాడు. ఇక ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నాడు. నాని కెరీర్ లో 30వ సినిమాగా ఈ మూవీ రాబోతుంది.

Nani : స్పీడ్ పెంచిన నాని.. ఆ క్రేజీ దర్శకుడితో నేచురల్ స్టార్ సినిమా చేయనున్నాడా..
Nani
Follow us on

నాని రీసెంట్ గా దసరా సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో కీర్తిసురేష్ హీరోయిన్ గా నటించింది. మునుపెన్నడూ కనిపించని ఊర మాస్ పాత్రలో నాని నటించి మెప్పించాడు. ఇక ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నాడు. నాని కెరీర్ లో 30వ సినిమాగా ఈ మూవీ రాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి గ్లింమ్ప్స్‌ను రిలీజ్ చేశారు. ఈ వీడియో ద్వారా సినిమా థీమ్ ను వివరించారు. తండ్రి కూతురుకి మధ్య జరిగే కథ ఇది అని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తోంది.అలాగే ఈ సినిమాలో స్టార్ బ్యూటీ శ్రుతిహాసన్ కూడా నటిస్తుందని తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.

ఇదిలా ఉంటే నాని మరో సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. ఓ బడా డైరెక్టర్ డైరెక్షన్ లో సినిమా చేయనున్నారట నేచురల్ స్టార్. ‘దృశ్యం’ సినిమాతో దేశం మొత్తం తనవైపు తిరిగి చూసేలా చేసుకున్న మలయాళ దర్శకుడు జీతూ జోషెఫ్. ఇప్పుడు నాని తో సినిమా చేయనున్నారట జీతూ జోషెఫ్.

ఇటీవలే జీతూ నానికి ఓ అదిరిపోయే కథను వినిపించారట. క్రైమ్ థ్రిల్లర్ స్టోరీని నానికి నేరేట్ చేశారట జీతూ. కథ నచ్చడంతో వెంటనే నాని ఓకే చేశారట. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రకటన త్వరలోనే రాబోతుందని టాక్ ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతుంది.