Nithiin: 300 మంది డ్యాన్సర్లతో నితిన్, శ్రీలీల స్టెప్పులు.. ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’ మాస్ సాంగ్..

కొద్ది రోజులుగా ఈ మూవీ షూటింగ్ వేగంగా జరుగుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్ సినీ ప్రియులను విపరీతంగా ఆకట్టుకుంది. అలాగే ఈ సినిమాలో సాంగ్స్ సైతం యూట్యూబ్ లో సూపర్ హిట్ అయ్యాయి. అయితే కొన్నాళ్లుగా ఎలాంటి అప్డేట్ లేకుండా సైలెంట్ గా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ మూవీ గురించి ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిల్మ్ సర్కిల్లో వైరలవుతుంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో శ్రీలీల, నితన్ మీద ఓ హై ఎనర్జీ మాస్ సాంగ్ షూట్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

Nithiin: 300 మంది డ్యాన్సర్లతో నితిన్, శ్రీలీల స్టెప్పులు.. ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ మాస్ సాంగ్..
Extraordinary Man Movie

Updated on: Nov 23, 2023 | 6:46 PM

టాలీవుడ్ హీరో నితిన్, మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ శ్రీలీల జంటగా నటిస్తోన్న సినిమా ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’. ఈ చిత్రానికి డైరెక్టర్ వక్కంతం వంశీ దర్శకత్వం వహిస్తున్నారు. కొద్ది రోజులుగా ఈ మూవీ షూటింగ్ వేగంగా జరుగుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్ సినీ ప్రియులను విపరీతంగా ఆకట్టుకుంది. అలాగే ఈ సినిమాలో సాంగ్స్ సైతం యూట్యూబ్ లో సూపర్ హిట్ అయ్యాయి. అయితే కొన్నాళ్లుగా ఎలాంటి అప్డేట్ లేకుండా సైలెంట్ గా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ మూవీ గురించి ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిల్మ్ సర్కిల్లో వైరలవుతుంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో శ్రీలీల, నితిన్ మీద ఓ హై ఎనర్జీ మాస్ సాంగ్ షూట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. జానీ మాస్టర్ కొరియోగ్రఫీలో దాదాపు 300 మందికి పైగా ఫిమేల్ డ్యాన్సర్లు ఈ పాటలో స్టెప్పులేయనున్నట్లు తెలుస్తోంది.

శంషాబాద్‏లో ప్రత్యేకంగా నిర్మించిన సెట్‏లో ఈ సాంగ్ షూటింగ్ జరుగుతుందని.. ఈ పాటతోనే మొత్తం ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ కానుందని టాక్. ఇక ఆ తర్వాత ప్రొడక్షన్ పనులు జరగనున్నాయి. అయితే ఇప్పటికే తన డ్యాన్స్‏తో వెండితెరపై అదరగొట్టేస్తోంది శ్రీలీల. ఇటు నితిన్ సైతం మంచి డాన్సర్ అన్న సంగతి తెలిసిందే. దీంతో ఈ ఇద్దరూ సూపర్ డ్యాన్సర్ కాంబోలో అది కూడా జానీ మాస్టర్ కొరియోగ్రఫీలో రాబోతున్న ఈ మాస్ సాంగ్ మరోసారి నెట్టింటిని షేక్ చేయడం ఖాయమని అంటున్నారు ఫ్యాన్స్. దీంతో ఇప్పుడు ట్విట్టర్ వేదికగా శ్రీలీల హ్యాష్ ట్యాగ్ ను తెగ ట్రెండ్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఈ సినిమాలో సీనియర్ హీరో రాజశేఖర్ కీలకపాత్ర పోషిస్తున్నారు. అలాగే రావు రమేష్,క సంపత్ ముఖ్య పాత్రలలో కనిపించనున్నారు. ఆదిత్య మూవీస్ అండ్ ఎంటర్టైన్మెంట్స్ , రుచిరా ఎంటర్టైన్మెంట్స్ సహకారంతో శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ పై సుధాకర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ ఏడాది డిసెంబర్ 8న ఈ మూవీ విడుదల కానుంది. ఇప్పటికే ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది చిత్రయూనిట్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.