Director Maruthi : మారుతి సినిమాకు “మంచి రోజులు వచ్చాయి”.. హీరోగా సంతోష్ శోభన్ ..

|

Jun 16, 2021 | 12:04 PM

టాలీవుడ్ టాలెంటెడ్ దర్శకుల్లో మారుతి ఒకరు. ఈ ఈ రోజుల్లో సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన మారుతి ఆతర్వాత బస్టాప్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు.

Director Maruthi : మారుతి సినిమాకు మంచి రోజులు వచ్చాయి.. హీరోగా సంతోష్ శోభన్ ..
Follow us on

Director Maruthi: టాలీవుడ్ టాలెంటెడ్ దర్శకుల్లో మారుతి ఒకరు. ఈ ఈ రోజుల్లో సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన మారుతి ఆతర్వాత బస్టాప్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు. మొదటి నుంచి కామెడీకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ సినిమా చేస్తున్న మారుతి తక్కువ కాలం లోనే టాలీవుడ్ లో టాప్ దర్శకుల లిస్ట్ లో చేరిపోయాడు. మొదట్లో యూత్ మెచ్చే సినిమాలు మాత్రమే చేస్తూ వచ్చిన మారుతి, ఆ తరువాత ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకునే సినిమాలు చేశారు.  భలే భలే మగాడివోయ్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న మారుతి ఆతర్వాత వరుసగా విజయవంతమైన సినిమాలను తెరకెక్కించారు.  ‘ప్రతిరోజూ పండగే’ సినిమా తరువాత మారుతి ‘పక్కా కమర్షియల్’ ప్రాజెక్టును సెట్ చేసుకున్నాడు. అయితే కరోనా కారణంగా ఈ సినిమా ఆలస్యం అవుతూవస్తోంది. ఈ సినిమాలో మ్యాచో హీరో గోపీచంద్ నటిస్తున్నారు. ఈ సినిమా కూడా మారుతి మార్క్ కామెడీ కమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో రాశిఖన్నా హీరోయిన్ గా నటిస్తుంది.

అయితే ఈ గ్యాప్ లో ప్రముఖ ఓటీటీ సంస్థ   ఆహా కోసం ఒక సినిమాను ప్లాన్ చేస్తున్నాడు మారుతి. ఇటీవల ఏక్ మినీ కథ సినిమాతో హిట్ అందుకున్న సంతోష్ శోభన్ – మెహ్రీన్ జంటగా నటిస్తున్న ఈ సినిమా, ఇప్పటికే చాలావరకూ షూటింగును జరుపుకుంది. మరికొన్ని రోజుల్లో షూటింగు పార్టును పూర్తి చేసుకోనుంది. ఈ సినిమాకి ‘మంచి రోజులు వచ్చాయి’ అనే టైటిల్ ను సెట్ చేసినట్టుగా చెప్పుకుంటున్నారు. ఈ సినిమా కరోనా కారణంగా ఏర్పడిన లాక్ డౌన్ నేపథ్యంలో ఉంటుందని టాక్.

మరిన్ని ఇక్కడ చదవండి :

Fast and Furious: 20 ఏళ్లుగా ఆడియన్స్‌ను అలరిస్తున్న ఓ సూపర్‌ హిట్ సీరిస్‌కు ఎట్టకేలకు శుభం కార్డ్..

Raashi Khanna: బాలీవుడ్ వెబ్ సిరీస్ కోసం సైకో కిల్లర్ గా మారనున్న బబ్లీ బ్యూటీ రాశిఖన్నా ..

కోవిడ్ బాధితులకు అండగా విజయ్ సేతుపతి..రూ. 25 లక్షలు అందజేత :Vijay Sethupathi donates Rs 25 lakh video.