Vijay – Chiranjeevi: విజయ్‌ దేవరకొండ వదులుకున్న చిత్రానికి చిరంజీవి ఓకే చెప్పాడా.? వైరల్‌గా మారిన ఆసక్తికర వార్త..

Vijay Devarakonda - Chiranjeevi: సైరా నర్సింహా రెడ్డి విడుదలై దాదాపు రెండేళ్లు గడుస్తోన్నా మెగా స్టార్‌ చిరంజీవి నుంచి సినిమా రాలేదు. దీంతో ఆయన అభిమానులు ఢీలా పడ్డారు. దీంతో అభిమానుల్లో జోష్‌ను నింపుతూ...

Vijay - Chiranjeevi: విజయ్‌ దేవరకొండ వదులుకున్న చిత్రానికి చిరంజీవి ఓకే చెప్పాడా.? వైరల్‌గా మారిన ఆసక్తికర వార్త..
Vijaydevarakonda Chiru

Updated on: Jul 27, 2021 | 9:40 PM

Vijay Devarakonda – Chiranjeevi: సైరా నర్సింహా రెడ్డి విడుదలై దాదాపు రెండేళ్లు గడుస్తోన్నా మెగా స్టార్‌ చిరంజీవి నుంచి సినిమా రాలేదు. దీంతో ఆయన అభిమానులు ఢీలా పడ్డారు. దీంతో అభిమానుల్లో జోష్‌ను నింపుతూ వరుస సినిమాలకు ఓకే చెప్పారు చిరు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న’ఆచార్య’ను ముగింపు దశకు తీసుకొచ్చిన చిరు.. తర్వాత వరుస సినిమాలకు సైన్‌ చేశారు. ఈ క్రమంలోనే లూసిఫర్‌ రీమేక్‌తో పాటు బాబీ దర్శకత్వంలో నటించనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాను అధికారికంగా ప్రకటించారు. లూసిఫర్‌ రీమేక్‌ చిత్రం పూర్తికాగానే బాబీతో సినిమా మొదలు పెట్టనున్నారు చిరు.

ఇదిలా ఉంటే చిరు-బాబీ చిత్రానికి సంబంధించి ఓ వార్త ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. నిజానికి బాబీ ఈ సినిమాను సిద్ధం చేసుకుంది రౌడీ హీరో విజయ్‌దేవరకొండ కోసమనేది సదరు వార్త సారాంశం. విజయ్‌కు బాబీ చెప్పిన కథ నచ్చినా డేట్స్‌ను అడ్జెస్ట్‌ చేయలేకపోయాడని దీంతో బాబీ ఇదే కథను చిరంజీవికి చెప్పారని సమాచారం. కథ వినగానే చిరు ఈ సినిమాకు ఓకే చెప్పడంతో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కిందని ఓ వార్త తాజాగా వైరల్‌గా మారింది. అయితే విజయ్‌కి చెప్పిన కథలో బాబీ చిన్న చిన్న మార్పులు చేశారని సమాచారం. చిరు ఇమేజ్‌కు తగ్గట్లు కొన్ని మార్పులు చేశారని టాక్‌ నడుస్తోంది. మరి ఈ వార్తలో ఎంత వరకు నిజం ఉందో తెలియాంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. ఇదిలా ఉంటే ప్రస్తుతం విజయ్‌ దేవరకొండ పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో లైగర్‌ చిత్రంలో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ ముంబయిలో శర వేగంగా నడుస్తోంది. విజయ్‌ దేవరకొండ తొలి పాన్‌ ఇండియా చిత్రం ఇదే కావడం విశేషం.

Also Read: Bangarraju Movie: మరోసారి నాగార్జునకు జోడీగా శ్రియ.. ‘బంగార్రాజు’ సినిమాలో..

Super Deluxe: టాలీవుడ్‌ ఆడియన్స్‌కు మరో ట్రీట్‌ ఇవ్వనున్న ఆహా.. ప్రేక్షకుల కోరిక మేరకు తెలుగులో సూపర్‌ డీలక్స్‌..

RRR Audio Rights: మొదలైన జక్కన్న రికార్డుల వేట.. దేశంలోనే అత్యధిక ధరకు ఆర్‌.ఆర్‌.ఆర్‌ ఆడియో హక్కులు.?