Tollywood: ఒక్క సినిమా కూడా చేయలేదు.. కానీ 4వేల కోట్ల యువరాణి.. ఈ రిచెస్ట్ హీరోయిన్ కూతురు ఎవరంటే?

సాధారణంగా సినిమా హీరోలు, హీరోయిన్ల కుమారులు, కూతుళ్లు సినిమాల్లోనే కెరీర్ వెతుక్కుంటారు. హీరో/ హీరోయిన్ గా రాణిస్తారు. అయితే ఈ టాలీవుడ్ హీరోయిన్ కూతురు మాత్రం డిఫరెంట్ గా ఆలోచించింది. సినిమా ఇండస్ట్రీకి చాలా దూరంగా ఉంటూ తనకు నచ్చిన దారిలో దూసుకెళుతోంది.

Tollywood: ఒక్క సినిమా కూడా చేయలేదు.. కానీ 4వేల కోట్ల యువరాణి.. ఈ రిచెస్ట్ హీరోయిన్ కూతురు ఎవరంటే?
Tollywood Actress Daughter

Edited By: TV9 Telugu

Updated on: May 30, 2025 | 12:30 PM

సినిమా ఇండస్ట్రీలో చాలా మంది స్టార్ కిడ్స్ ఉన్నారు. వారిలో చాలామంది తమ తల్లిదండ్రుల జాడల్లోనే నడుస్తున్నారు. సినిమాల్లోనే తమ కెరీర్ వెతుక్కుంటున్నారు. కానీ కొందరు మాత్రం ఈ గ్లామర్ ప్రపంచానికి దూరంగా ఉంటున్నారు. తమకు నచ్చిన దారిలో పయనిస్తూ తమకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు.ఈ టాలీవుడ్ హీరోయిన్ కూతురు కూడా సరిగ్గా ఇదే కోవకు చెందుతుంది. ఈమె తల్లి ఐకానిక్ హీరోయిన్ అలాగే ప్రముఖ వ్యాపారవేత్త కూడా. కోట్లాది రూపాయల ఆస్తులున్నాయి. సినిమా ఇండస్ట్రీలో పెద్ద పెద్ద వాళ్లతో పరిచయాలు, ముఖ్యంగా స్టార్ హీరోలతో మంచి అనుబంధముంది. సాధారణంగా ఇలాంటి స్టార్ స్టేటస్ ఉండే సినిమాల్లోనే సెటిల్ అవుతారు. కానీ ఈ హీరోయిన్ కూతురు మాత్రం బిజినెస్, స్పోర్ట్స్ రంగాల్లో దూసుకెళ్తోంది. చిన్నప్పటి నుంచి చదువుల్లో చురుకుగా ఉండే ఆమె కొలంబియా యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. కానీ ఇతర స్టార్ కిడ్స్‌లా సినిమాల్లోకి రావాలని ఎప్పుడూ అనుకోలేదు. చిన్నప్పటి నుంచే బిజినెస్ అంటే ఆసక్తి ఇంట్రెస్ట్ ఉండడంతో అదే రంగంలో సెటిల్ అయింది. ఫ్యామిలీ బిజినెస్‌లో యాక్టివ్‌గా మారింది. 22 ఏళ్లకే ఐపీఎల్ వేలంలో పాల్గొని అందరి దృష్టిని ఆకర్షించిన ఈ యువరాణి మరెవరో కాదు ప్రముఖ హీరోయిన్ జుహీ చావ్లా కూతురు జాన్వీ మెహతా

జుహీ చావ్లా ఐపీఎల్ లో కోల్ కతా నైట్ రైడర్స్ టీమ్ కు కో ఓనర్ గా వ్యవహరిస్తోంది. ఈ క్రమంలో జాన్వీ మెహతా కూడా జుహీ వెంట ఉంటూ బిజినెస్ బాధ్యతలను చూసుకుంటోంది. జాన్వీ మొదటిసారిగా ఐపీఎల్ 2022 వేలంలో అందరి దృష్టినీ ఆకర్షించింది. షారుఖ్ ఖాన్ వారసులు ఆర్యన్, సుహానాతో కలిసి కేకేఆర్. ఆ తర్వాత మళ్లీ ఐపీఎల్ 2025 వేలంలో పాల్గొంది. ప్రస్తుతం జాన్వీ వయసు కేవలం 22 సంవత్సరాలే. అయితేనేం స్పోర్ట్స్ బిజినెస్ లో జెట్ స్పీడ్ లో దూసుకెళుతోంది.

ఇవి కూడా చదవండి

జుహీ చావ్లా ఫ్యామిలీ..

కాగా హురున్ రిచ్ లిస్ట్ 2024 ప్రకారం, జూహీ చావ్లా నికర ఆస్తి రూ.4,600 కోట్లు. అలాగే మెహతా గ్రూప్ ఆస్తుల విలువ 500 మిలియన్ డాలర్లకు పైగా (సుమారు రూ.4,215 కోట్లు) ఉంటుంది. మొత్తానికి జాన్వీ ఇప్పటికే వేలకోట్లకు యువరాణిగా ఉంది.

గతేడాది ఐపీఎల్ ట్రోఫీతో..

 

ఇవి కూడా చదవండి..

OTT Movie: పౌర్ణమి రోజున రెచ్చిపోయే రక్త పిశాచి.. ఓటీటీలో ఇంటెన్స్ హారర్ థ్రిల్లర్.. చిన్న పిల్లలు చూడొద్దు

Tollywood: 17 ఏళ్లకే సినిమాల్లోకి.. బిగ్ బాస్‌తో ఎనలేని క్రేజ్.. ఈ విజయవాడ బ్యూటీని గుర్తు పట్టారా?

Tollywood: ఏంటమ్మా ఇది! వోడ్కాకు బ్రాండ్ అంబాసిడర్‌గా టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. నెటిజన్ల ఆగ్రహం

Hari Hara Veera Mallu: పవన్ హరి హర వీరమల్లులో మెరిసిన టాలీవుడ్ ఫేమస్ డైరెక్టర్.. ఎవరో గుర్తు పట్టారా?

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.