Adivi Sesh: ఆ సినిమా విషయంలో శేష్‌ను దారుణంగా మోసం చేశారట.. హర్ట్ అయిన హీరో

హీరో కాకముందు అడవి శేష్ పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించి మెప్పించాడు. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన పంజా సినిమాలో కీలక పాత్రలో కనిపించాడు శేష్.

Adivi Sesh: ఆ సినిమా విషయంలో శేష్‌ను దారుణంగా మోసం చేశారట.. హర్ట్ అయిన హీరో
Adivi Sesh
Follow us
Rajeev Rayala

|

Updated on: Dec 01, 2022 | 8:14 AM

యంగ్ హీరో అడవి శేష్ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. ఇటీవలే మేజర్ సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్న శేష్. ఇప్పుడు హిట్ 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. హీరో కాకముందు అడవి శేష్ పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించి మెప్పించాడు. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన పంజా సినిమాలో కీలక పాత్రలో కనిపించాడు శేష్. అంతకు మందు కర్మ అనే సినిమా చేశాడు. ఆ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఇదిలా ఉంటే శేష్ హీరో అవ్వక ముందు నటించిన ఓ సినిమా విషయంలో తనకు మోసం జరిగిందట. దర్శకుడు చెప్పింది ఒకటి చేసింది మరొకటట.. ఆ  కోపంతో ఇంతవరకు ఆ సినిమాను చూడలేదట. ఆ సినిమా ఎదో తెలుసా..?

శేష్ చిన్న చిన్న పాత్రల్లో కొన్ని సినిమాల్లో నటించాడు. వాటిలో శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన సొంతం సినిమా ఒకటి. సొంతం సినిమాలో ఆర్యన్ రాజేష్ హీరోగా నటించాడు. అలాగే ఈ సినిమాలో హీరోయిన్ గా నమిత నటించింది. ఈ మూవీ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాలో సునీల్ హైలైట్ అయ్యాడు. హీరో కంటే సునీల్ కే ఎక్కువ పేరు వచ్చింది.

ఇవి కూడా చదవండి

అయితే ఈ సినిమాలో శేష్ చిన్న పాత్రలో కనిపించాడు.. ఆవిషయం చాలా మందికి తెలియక పోవచ్చు. అయితే ముందుగా శ్రీను వైట్ల ఈ సినిమాలో సెకండ్ హీరో అని చెప్పారట.. కథలో చాలా ఇంపార్టెంట్ రోల్ అని చెప్పారట.. కనే ఏ చిన్న పాత్రకే పరిమితం చేశారు. కేవలం మూడు రోజుల్లో షూటింగ్ కంప్లీట్ చేసి పంపించేశారట. దాంతో శేష్ కోపంతో ఇప్పటికీ ఆ మూవీ చూడలేదట. సెకండ్ హీరో అని చెప్పి మోసం చేశారని శేష్ ఫీల్ అయ్యాడట. అప్పుడు శేష్ చిన్న నటుడు కాబట్టి ఈ వార్త బయటకు రాలేదు. ఇక ఇప్పుడు స్టార్ హీరోగా మారిపోయాడు. హిట్ 2 సినిమాతో మరో సక్సెస్ సాధించడానికి రెడీగా ఉన్నాడు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.