Kalki 2898 AD: ‘కల్కి 2898 AD’ టీజర్ పై ఇంట్రెస్టింగ్ అప్డేట్.. నిడివి ఎంత ఉంటుందంటే..

డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఈ సినిమాను సైన్స్ ఫిక్షన్ జోనర్ లో తెరకెక్కిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణే, దిశా పటానీ, బిగ్ బీ అమితాబ్, కమల్ హాసన్ కీలకపాత్రలలో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ ఆకట్టుకున్నాయి. ఇక గతంలో రిలీజ్ అయిన గ్లింప్స్ సినిమాపై మరింత క్యూరియాసిటిని కలిగించాయి. ఇందులో ప్రభాస్ సరికొత్త పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా అప్డే్ట్స్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు.

Kalki 2898 AD: కల్కి 2898 AD టీజర్ పై ఇంట్రెస్టింగ్ అప్డేట్.. నిడివి ఎంత ఉంటుందంటే..
Kalki 2898 Ad

Updated on: Jan 11, 2024 | 5:32 PM

ఇటీవలే సలార్ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఊహించని రేంజ్ లో వసూళ్లు రాబట్టింది. దీంతో ఇప్పుడు డార్లింగ్ నటిస్తోన్న సినిమాలపై మరింత హైప్ పెరిగింది. అందులో కల్కి 2898 AD ఒకటి. డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఈ సినిమాను సైన్స్ ఫిక్షన్ జోనర్ లో తెరకెక్కిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణే, దిశా పటానీ, బిగ్ బీ అమితాబ్, కమల్ హాసన్ కీలకపాత్రలలో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ ఆకట్టుకున్నాయి. ఇక గతంలో రిలీజ్ అయిన గ్లింప్స్ సినిమాపై మరింత క్యూరియాసిటిని కలిగించాయి. ఇందులో ప్రభాస్ సరికొత్త పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా అప్డే్ట్స్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా కల్కి సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర విషయం ఫిల్మ్ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది.

తాజాగా నెట్టింట ప్రచారం జరుగున్న సమాచారం ఏంటంటే.. ఈ సినిమా టీజర్ కు సెన్సార్ బోర్టు యూఏ సర్టిఫికేట్ జారీ చేసిందంట. అంతేకాదు.. ఈ టీజర్ నిడివి 1 నిమిషం 23 సెకన్లు. అలాగే రేపు (జనవరి 12న) ఈ మూవీ టీజర్ పై నాగ్ అశ్విన్ టీం క్లారిటీ ఇవ్వనుందట. ఇప్పటికే మేకర్స్ లాంచ్ చేసిన 2898 ఏడీ రైడర్స్ (యూనిఫార్మడ్ విలన్ ఆర్మీ) కాస్ట్యూమ్స్ మేకింగ్, అసెంబ్లింగ్ వీడియో సినిమాపై క్యూరియాసిటీని పెంచేస్తుంది. ఈ మూవీ కోసం యంగ్ రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు.

ఈ సినిమాను వైజయంతీ మూవీస్ బ్యానర్ పై సీ అశ్వనీదత్ అత్యంత ప్రతిష్టాత్మకంగా రూ. 500 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా టీజర్ ను త్వరలోనే రిలీజ్ చేయనున్నారు. ఇటీవల ఐఐటీ బాంబే Tech Fest 23లో భాగంగా కాన్వొకేషన్ హాల్లో జరిగిన చిట్ చాట్ లో పాల్గొన్న నాగ్ అశ్విన్ మాట్లాడుతూ.. ఈ సినిమా ట్రైలర్ ఏప్రిల్ 1న విడుదల చేయనున్నట్లు క్లారిటీ ఇచ్చాడు. ఈ సినిమాతోపాటు డైరెక్టర్ మారుతీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు ప్రభాస్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.