Devara Movie: దేవరపై ఇంట్రెస్టింగ్ న్యూస్.. మరోసారి డ్యూయల్ రోల్ చేయనున్న ఎన్టీఆర్ ?..
సముద్రం నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమా కావడంతో విజువల్ ఎఫెక్ట్స్ భారీగానే ఉండబోతున్నాయి. దేవరలో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు తెలుస్తుంది. గతంలో అదుర్స్, ఆంధ్రావాలా లాంటి సినిమాల్లో తారక్ డ్యూయల్ రోల్ చేసారు. దేవరలో మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఇది రెండు భాగాలుగా రాబోతుంది. ప్రస్తుతానికి అయితే ఇవన్నీ గాసిప్పే కానీ నిజం కాదని మాత్రం చెప్పలేం.

దేవరతో పదేళ్లు వెనక్కి వెళ్తున్నారు కొరటాల శివ. అప్పట్లో మిర్చి సినిమాకు ఎంత కష్టపడ్డారో తెలియదు కానీ.. దానికి రెండింతలు దేవరపై ఫోకస్ చేస్తున్నారు ఈ దర్శకుడు. ఒక్క ఫ్లాప్‌తోనే కొరటాలలో ఈ రేంజ్ కసి ఎందుకు పెరిగింది..? ఆచార్య ఫలితం ఈయన్ని అంతగా డిస్టర్బ్ చేసిందా లేదంటే ఇంకా ఏదైనా కారణాలున్నాయా..? అసలు దేవర ఎలా వస్తుంది..? షూటింగ్ ఎంతవరకు వచ్చింది..? ఇవన్నీ ఎక్స్‌క్లూజివ్ స్టోరీలో చూసేద్దామా..
ఈ పాటలాగే దేవర కూడా అదిరిపోవాలని అహర్నిషలు కష్టపడుతున్నారు కొరటాల శివ. ఒక్క ముక్కలో చెప్పాలంటే.. తన మొదటి సినిమా మిర్చి కోసం ఎంత కష్టపడ్డారో తెలియదు కానీ దానికంటే రెండింతలు ఎక్కువగానే దీనికోసం ప్రాణం పెడుతున్నారీయన. ఆచార్య ఫలితం ఈయన్ని అంతగా డిస్టర్బ్ చేసింది.. అలాంటి డిజాస్టర్ తర్వాత కూడా తనను నమ్మిన తారక్ నమ్మకాన్ని నిలబెట్టేందుకే ఏడాదిగా చెమటోడుస్తున్నారు కొరటాల.




ఎన్టీఆర్ ఇన్ స్టా పోస్ట్..
View this post on Instagram
కేవలం స్క్రిప్ట్ కోసమే ఆర్నెళ్లు వర్క్ చేసిన కొరటాల.. ప్రీ ప్రొడక్షన్ కోసం మరో ఆర్నెళ్లు తీసుకున్నారు. అన్నీ కుదిరాకే దేవర సెట్స్‌పైకి వచ్చింది. హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వస్తున్నా.. హాలీవుడ్ టెక్నీషియన్స్ దీనికోసం పని చేస్తున్నారు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కెమెరా అయిన అలెక్స్ ALF, అర్రీ సిగ్నేచర్ ప్రైమ్ లెన్స్ వాడుతున్నారు కొరటాల. ఈ యాక్షన్ సీక్వెన్స్‌లు ఇండియన్ స్క్రీన్‌పై నెవర్ బిఫోర్ అన్నట్లు చిత్రీకరిస్తున్నారు.
దేవర మూవీ ట్వీట్..
250 days to witness fear unleash on the big screen 💥🌊
Vastunna….#Devara from 5th April 2024. pic.twitter.com/CCaARI8Fwm
— Devara (@DevaraMovie) July 30, 2023
సముద్రం నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమా కావడంతో విజువల్ ఎఫెక్ట్స్ భారీగానే ఉండబోతున్నాయి. దేవరలో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు తెలుస్తుంది. గతంలో అదుర్స్, ఆంధ్రావాలా లాంటి సినిమాల్లో తారక్ డ్యూయల్ రోల్ చేసారు. దేవరలో మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఇది రెండు భాగాలుగా రాబోతుంది. ప్రస్తుతానికి అయితే ఇవన్నీ గాసిప్పే కానీ నిజం కాదని మాత్రం చెప్పలేం.
దేవర మూవీ ట్వీట్..
#DEVARA – THE LORD OF FEAR 🌊 🗡️
See you in theatres on 5.4.24. https://t.co/oq1R7GrWKq
— Devara (@DevaraMovie) May 19, 2023
క్లైమాక్స్‌లో పార్ట్ 2కి సంబంధించిన లీడ్ ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. జాన్వీ కపూర్ ఈ సినిమాతోనే పరిచయం అవుతున్నారు. దేవరతో హిట్ కొట్టి.. ఆచార్య బాకీ తీర్చేయాలని చూస్తున్నారు కొరటాల. అందుకే అన్నీ దగ్గరుండి చూసుకుంటున్నారు. తాజాగా లిరికల్ వర్క్ మొదలైంది. ఇదే విషయాన్ని రామజోగయ్య శాస్త్రి ట్వీట్ చేసారు. గతంలోనూ కొరటాలకు 90 శాతం పాటలు ఈయనే రాసారు. మొత్తానికి చూడాలిక.. కొరటాల కసి దేవరలో ఎలా ఉండబోతుందో..?
దేవర మూవీ ట్వీట్..
For his ocean of fandom, here’s a plain still to set screens on fire… 🌊🗡️#DEVARA https://t.co/oq1R7GsuzY pic.twitter.com/PDiFFyZxeJ
— Devara (@DevaraMovie) May 19, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




