Das Ka Dhamki: విశ్వక్ సేన్ ధమ్కీ బదులు రవితేజ ధమాకా.. అవాక్ అయిన ఆడియన్స్

|

Mar 22, 2023 | 2:41 PM

ఈ సినిమా భారీ అంచనాల మధ్య మార్చి 22న ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఈ సినిమా మీద విశ్వక్ సేన్ చాలా నమ్మకంతో ఉన్నారు.

Das Ka Dhamki: విశ్వక్ సేన్ ధమ్కీ బదులు రవితేజ ధమాకా.. అవాక్ అయిన ఆడియన్స్
Dhamki, Dhamaka
Follow us on

విశ్వక్ సేన్ నటించిన దాస్ కా ధమ్కీ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. విశ్వక్ సేన్ హీరోగా, దర్శకుడిగా తెరకెక్కించిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య మార్చి 22న ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఈ సినిమా మీద విశ్వక్ సేన్ చాలా నమ్మకంతో ఉన్నారు. ఇప్పటికే ఈ సినిమానుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి . ఇదిలా ఉంటే పలు థియేటర్స్ లో దమ్కీకి బదులు ధమాకా సినిమాను వేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రవితేజ హీరోగా వచ్చిన ధమాకా సినిమా మంచి విజయాన్ని అందుకుంది.

ఇక ధమ్కీ సినిమాకు బెజవాడ ప్రసన్న కుమార్ కథను అందించగా.. విశ్వక్ దర్శకత్వం వహించి హీరోగా నటించాడు. ఈ సినిమాలో నివేదపేత్ రాజ్ హీరోయిన్ గా చేసింది. ధమాకా సినిమాకు కూడా బెజవాడ ప్రసన్న కుమారే కథను అందించారు.

ఇక ధమాకా సినిమా థియేటర్స్ లో ప్రత్యేక్షం అవ్వడంతో ప్రేక్షకులు షాక్ అయ్యారు. ఓరి బాబోయ్ ధమాకా సినిమా కాదురా.. మారిపోయిందారా ధమ్కీ సినిమా రా బాబు అని అరిచి గోల చేశారు.