Cannes Film Festival: కేన్స్‌ ఫిలిం ఫెస్టివల్‌లో సత్యజిత్ రే సినిమా స్పెషల్ షో..

ఇండియన్ సినిమా స్థాయి ఇప్పుడు ప్రమంచ వ్యాప్తంగా మారుమ్రోగుతుంది. తాజాగా కేన్స్‌ ఫిలిం ఫెస్టివల్‌లో భారత్‌కు అరుదైన గౌరవం దక్కింది.

Cannes Film Festival: కేన్స్‌ ఫిలిం ఫెస్టివల్‌లో సత్యజిత్ రే సినిమా స్పెషల్ షో..
Cannes Film Festival

Updated on: May 05, 2022 | 8:34 AM

ఇండియన్ సినిమా స్థాయి ఇప్పుడు ప్రమంచ వ్యాప్తంగా మారుమ్రోగుతుంది. తాజాగా కేన్స్‌ ఫిలిం ఫెస్టివల్‌(Cannes Film Festival)లో భారత్‌కు అరుదైన గౌరవం దక్కింది. అధికారిక దేశం హోదా కేన్స్‌ ఫిలిం ఫెస్టివల్‌లో భారత్‌కు అరుదైన గౌరవం లభించింది. అంతేకాదు కేన్స్‌లో ఇండియన్‌ మూవీని ప్రత్యేకంగా ప్రదర్శించనున్నారు. ఇండియా స్వాతంత్ర్య అమృత మహోత్సవం జరుపుకుంటున్న ఈ ఏడాదే కేన్స్‌ ఫిలిం ఫెస్టివల్‌ కూడా 75 వసంతాల వేడుక జరుపుకుంటోంది. ఫ్రాన్స్‌లోని కేన్స్‌లో ఈ నెల 17 నుంచి 28 వరకు చలన చిత్రోత్సవాలు జరగనున్నాయి. అంతర్జాతీయ సినిమా రంగంలో ఆస్కార్ అవార్డులకు ఎనలేని ప్రాధాన్యత ఉంటుంది. అదే తరహాలో కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌లో ప్రదర్శితమయ్యే చిత్రాలకు కూడా అంతే గుర్తింపు ఉంది.

75 వసంతాల వేళ కేన్స్‌ ఫిలిం ఫెస్టివల్‌ నిర్వాహకులు కీలక నిర్ణయం తీసుకున్నారు. 75 వసంతాల స్వతంత్ర భారత్‌కు కేన్స్ ఫిలిం ఫెస్టివల్ మార్కెట్‌లో అధికారిక దేశం హోదా కల్పించారు. ఇది భారత్‌కు అరుదైన గౌరవం. అలాగే ఈ ఏడాది కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌లో భారతీయ దిగ్గజ దర్శకుడు సత్యజిత్ రే తెరకెక్కించిన ప్రతిధ్వని చిత్రాన్ని ప్రత్యేకంగా ప్రదర్శించనున్నారు. ఈ సినిమాను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా 4కే టెక్నాలజీకి మారుస్తున్నారు. మరో ఇండియన్ మూవీ, అరవిందన్ గోవిందన్ దర్శకత్వం వహించిన థాంప్ ను కూడా ప్రదర్శిస్తారు. హాలీవుడ్ క్లాసిక్‌గా పేరుగాంచిన ‘సింగిన్ ద రెయిన్’ కేన్స్‌లో ప్రదర్శించే మరో సినిమా. అలాగే బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకునేకు అరుదైన గౌరవం లభించింది. కేన్స్ ఫిలిం ఫెస్టివల్ కాంపిటిషన్ జ్యూరీలో మెంబర్‌గా ఎంపిక అయ్యింది దీపిక.

మరిన్ని ఇక్కడ చదవండి : 

ఇవి కూడా చదవండి

Nora Fatehi : పవర్ స్టార్ సినిమాలో ఛాన్స్ దక్కించుకున్న బాలీవుడ్ హాట్ బ్యూటీ

Keerthy Suresh: మహానటి ఆశలన్నీ మహేష్ సినిమా పైనే.. ఈ సారి కీర్తి గట్టెక్కేనా..?

Chiranjeevi: అప్‌కమింగ్ ప్రాజెక్ట్స్ కోసం పక్కా ప్లాన్‌తో రెడీ అవుతున్న మెగాస్టార్