India Pakistan War: పాక్‌తో యుద్ధం .. హీరోయిన్ షాకింగ్ పోస్ట్.. భగ్గుమంటోన్న నెటిజన్లు

భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇప్పటికే ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో భారత సైన్యానికి మానసిక స్థైర్యాన్ని ఇచ్చేలా పలువురు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

India Pakistan War: పాక్‌తో యుద్ధం .. హీరోయిన్ షాకింగ్ పోస్ట్.. భగ్గుమంటోన్న నెటిజన్లు
India Pakistan War

Updated on: May 09, 2025 | 5:09 PM

ఏప్రిల్ 22న పహల్గామ్ వేదికగా జరిగిన ఉగ్రదాడిలో 26 మంది అమాయకపు ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటనతో యావత్ భారతదేశం విషాదంలో మునిగిపోయింది. ఇకపై భవిష్యత్ లో ఇలాంటి ఉగ్రదాడులు జరగొద్దనే ప్రధాన ఉద్దేశంతోనే భారత సైన్యం ఆపరేషన్ సిందూర్ మొదలుపెట్టింది. పీఓకేలోని అలాగే పాకిస్తాన్ లో ఉన్న ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా దాడులు మొదలు పెట్టింది. సుమారు 100 మంది ఉగ్రవాదులను మట్టు బెట్టింది. బదులుగా పాకిస్తాన్ నుంచి కూడా ప్రతి దాడులు మొదలయ్యాయి. ఈ క్రమంలో భారత సైన్యానికి మానసిక స్థైర్యం ఇస్తూ సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు సోషల్ మీడియాలో పోస్టుల పెడుతున్నారు. భారత సైన్యం పాక్ కు గట్టిగా బుద్ధి చెప్పాలని కోరుతున్నారు. ఈ క్రమంలో తాజాగా మలయాళ నటి అమీనా నిజం షేర్ చేసిన ఒక పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. దీనిని చూసిన నెటిజన్లు భగ్గుమంటున్నారు.

‘అవును అనేక ప్రశ్నలకు సమాధానం దొరకని పరిస్థితుల్లో అధ్వానంగా ఉన్నప్పుడు మన దేశం చంపడాన్ని పరిష్కారంగా ఎంచుకుంది. పాకిస్తాన్ ప్రజలను చంపడం సిగ్గుచేటు. పహల్గామ్ ఉగ్ర దాడికి ప్రతీకారం తీర్చుకోవాలని భావించే వ్యక్తులు ఇప్పుడు తారుమారు అయ్యారు. మనం చేస్తున్న యుద్ధం వల్ల అక్కడి పౌరులకు మాత్రమే నష్టం వాటిల్లుతుంది. నేను అహం దెబ్బతిన్నప్పుడు మాత్రమే మాట్లాడేదాన్ని కాదు. ప్రజల సంక్షేమం కోసం ఆలోచించే భారతీయురాలిని’ అని అమీనా రాసుకొచ్చింది.

ఇవి కూడా చదవండి

అమీనా లేటెస్ట్ ఫొటోస్..

ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది. దీనిని చూసిన వారంతా నటిని దారుణంగా విమర్శిస్తున్నారు. పాకిస్తాన్‌కు సపోర్ట్ చేయడమేంటని అంటున్నారు.

భగ్గుమంటోన్న నెటిజన్లు..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.