‘మహర్షి’ పార్ట్‌నర్స్‌కి ఝలక్!..ఐటీ దాడుల మర్మమేంటి..?

| Edited By: Pardhasaradhi Peri

Oct 22, 2019 | 4:21 PM

ప్రముఖ సినిమా డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఏషియన్ కార్యాలయాలపై ఐటీ దాడులు నిర్వహించింది. ఏషియన్ సినిమా అధినేతలు నారాయణదాష్ నారంగ్, సునీల్ నారంగ్ ఇళ్లలో సోదాలు నిర్వహించారు. వారి సన్నిహితుల ఇండ్లలో కూడా ఐటీ సోదాలు జరిగాయి. నైజాంలో చిత్రాల పంపిణీ, ఏషియన్ థియేటర్లను నారంగ్ నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం వారు తమ సొంత బ్యానర్‌పై నాగచైతన్య, సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో సినిమా నిర్మిస్తున్నారు. కొన్నాళ్ల కింద టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి ఏఎంబి  […]

మహర్షి పార్ట్‌నర్స్‌కి ఝలక్!..ఐటీ దాడుల మర్మమేంటి..?
Follow us on

ప్రముఖ సినిమా డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఏషియన్ కార్యాలయాలపై ఐటీ దాడులు నిర్వహించింది. ఏషియన్ సినిమా అధినేతలు నారాయణదాష్ నారంగ్, సునీల్ నారంగ్ ఇళ్లలో సోదాలు నిర్వహించారు. వారి సన్నిహితుల ఇండ్లలో కూడా ఐటీ సోదాలు జరిగాయి. నైజాంలో చిత్రాల పంపిణీ, ఏషియన్ థియేటర్లను నారంగ్ నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం వారు తమ సొంత బ్యానర్‌పై నాగచైతన్య, సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో సినిమా నిర్మిస్తున్నారు.

కొన్నాళ్ల కింద టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి ఏఎంబి  సినిమాస్ మొదలు పెట్టింది ఏషియన్ సినిమా సంస్ద. ఇప్పటికీ వాళ్లు అందులో భాగస్వాములుగా ఉన్నారు. దాంతో పాటు ఇతర బిజినెస్ కూడా చేస్తున్నారు. అంతేకాదు నైజాంలో విడుదలయ్యే ప్రతీ భారీ సినిమాల  డిస్ట్రిబ్యూషన్ హక్కులను దాదాపు దక్కించుకునేది ఏషియన్ సినిమాసే. ఇక తెలంగాణలో వీళ్లకు చాలా సంఖ్యలో ఎషియన్ సినిమాస్ పేరిట థియేటర్స్ ఉన్నాయి. త్వరలో హీరో అల్లు అర్జున్‌తో కలిసి మరో మల్టిఫ్లెక్స్ నిర్మాణం చేపడుతున్నారని సమాచారం.