హీరోయిన్స్ చాలా మంది ఏడాదికి ఒకటో లేక రెండో సినిమాలు చేస్తున్నారు. కానీ కొంతమంది భామలు మాత్రం చేతి నిండా సినిమాలతో దూసుకుపోతున్నారు. మొన్నటి వరకు పూజా హెగ్డే, తమన్నా, సమంత లాంటి స్టార్ హీరోయిన్స్ వరుసగా సినిమాలు చేసి ప్రేక్షకులను అలరించారు. కానీ ఆతర్వాత సినిమాలు తగ్గించారు. ఇప్పుడు ఒకటి రెండు సినిమాలు మాత్రమే చేస్తున్నారు. ఆతర్వాత వచ్చిన యంగ్ బ్యూటీస్ శ్రీలీల, కృతి శెట్టి కూడా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా గడిపేశారు. యంగ్ హీరోలందరి సరసన నటించి మెప్పించారు. ఎక్కడ చూసిన ఈ ముద్దుగుమ్మల పేర్లే వినిపించాయి. కానీ ఫ్లాప్ లు పలకరించడంతో ఈ భామల స్పీడ్ కు బ్రేకులు పడ్డాయి. కానీ ఇప్పుడు ఓ హీరోయిన్ మాత్రం ఎక్కడా తగ్గేదే లే అంటుంది. 2025లో బిజీ హీరోయిన్ ఎవరు అంటే ముందు చెప్పేది ఆమె పేరే. యంగ్ హీరోయిన్ కాదు.. అయినప్పటికీ పాన్ ఇండియా వైడ్ గా సినిమాలు చేస్తుంది.
ఒకటి కాదు రెండు కాదు తెలుగు, తమిళ్, మలయాళం భాషల్లో వరుసగా సినిమాలు చేసి ఆకట్టుకుంటుంది. ఇప్పుడు 2025లోనూ వరుస సినిమాలను లైనప్ చేసి దూసుకుపోతుంది. ఈ ఏడాది ఏకంగా ఆరు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానుంది ఆ ముద్దుగుమ్మ. పైగా ఆ ఆరు సినిమాలు కూడా పెద్ద హీరోల సినిమాలే.. ఇంతకూ ఆ బ్యూటీ ఎవరో కాదు చెన్నై చంద్రం త్రిష. ఒకప్పుడు ఈ అమ్మడు తెలుగులో స్టార్ హీరోయిన్ గా రాణించింది. ఇప్పుడు పాన్ ఇండియా మూవీస్ తో బిజీగా ఉంది.
త్రిష 2024లో ఒక్క సినిమాలో కూడా నటించలేదు. దళపతి విజయ్ నటించిన గోట్ సినిమాలో స్పెషల్ సాంగ్ లో స్టెప్పులేసింది అంతే.. కానీ ఈ ఏడాది మమాత్రం వరుస సినిమాలను లైనప్ చేసింది. ముందుగా అజిత్ హీరోగా నటిస్తున్న విదాముయార్చి సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు మిజ్ తిరుమేని దర్శకత్వం వహించారు. అలాగే అజిత్ నటిస్తున్న మరో సినిమా గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాలోనూ త్రిషనే హీరోయిన్ గా చేస్తుంది. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని పుష్ప నిర్మించిన మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. అలాగే మణిరత్నం దర్శకత్వంలో కమల్ హాసన్ నటిస్తున్న థగ్ లైఫ్ సినిమాలోనూ త్రిష నటిస్తుంది. అలాగే సూర్య 45లోనూ ఈ అమ్మడే హీరోయిన్. వీటితో పాటు మన తెలుగులో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న విశ్వంభర సినిమాలో త్రిష హీరోయిన్ గా చేస్తుంది. వీటితో పాటు టోవినో థామస్‌తో ఐడెంటిటీ అనే సినిమా మలయాళంలో చేస్తుంది త్రిష.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.