మొన్నటివరకు స్టైలిష్ స్టార్ గా ఉన్న అల్లు అర్జున్(Allu Arjun).. ఇప్పుడు ఐకాన్ స్టార్.. పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమా పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది. బన్నీ నటించిన మొదటి పాన్ ఇండియా సినిమా ఇది. పుష్ప సినిమాలో మునుపెన్నడూ చూడని లుక్ లో కనిపించి అక్కట్టుకున్నాడు బన్నీ. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో బన్నీ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటించి మెప్పించింది. ఇక ఇప్పుడు ఈ సినిమా పార్ట్ 2 తెరకెక్కిస్తున్నాడు సుకుమార్. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలు కానుంది. పార్ట్ 1 కంటే మించి ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలతో పాటు.. ట్విస్ట్ లు ఉంటాయని అంటున్నారు. ఇదిలా ఉంటే బన్నీ పుష్ప 2 తర్వాత ఎవరితో సినిమా చేస్తున్నాడన్నది ఆసక్తికరంగా మారింది.
అయితే బన్నీ పుష్ప సినిమా కంటే ముందే వేణు శ్రీరామ్ తో ఓ సినిమా కమిట్ అయ్యారు. ఈ సినిమాకు ఐకాన్ అనే టైటిల్ కూడా అనుకున్నారు అయితే వేణు పవన్ వకీల్ సాబ్ తో.. బన్నీ పుష్ప సినిమాతో బిజీ అవ్వడంతో ఈ సినిమా షూటింగ్ కు బ్రేక్ ఇచ్చాడు. అయితే ఇప్పుడు పుష్ప 2 తర్వాత బన్నీ త్రివిక్రమ్ డైరెక్షన్ లో సినిమా చేయనున్నాడని అంటున్నారు. గతంలో ఈ ఇద్దరి కాంబోలో జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అలవైకుంఠపురంలో సినిమాల్లో నటించిన విషయం తెలిసిందే. ఈ మూడు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు మరోసారి బన్నీ ఎం గురూజీ కాంబోలో సినిమా ఉండనుందని అంటున్నారు. ప్రస్తుతం త్రివిక్రమ్ మహేష్ తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత బన్నీ మూవీ ఉండొచ్చు..
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.