Allu Arjun: ఆహా ఇంత త్వ‌ర‌గా.. ఇంత‌ స‌క్సెస్ అవుతుంద‌ని అస‌లు అనుకోలేదు: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌

|

Nov 04, 2021 | 6:28 PM

తిరుగులేని, నాన్‌స్టాప్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ను అందిస్తూ తెలుగు వారి హృద‌యాల్లో ప్ర‌త్యేక స్థానాన్ని ద‌క్కించుకున్న వ‌న్ అండ్ ఓన్లీ 100 పర్సెంట్‌ తెలుగు ఓటీటీ మాధ్య‌మం ‘ఆహా’.

Allu Arjun: ఆహా ఇంత త్వ‌ర‌గా.. ఇంత‌ స‌క్సెస్ అవుతుంద‌ని అస‌లు అనుకోలేదు: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌
Bunny
Follow us on

Aha 2.0: తిరుగులేని, నాన్‌స్టాప్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ను అందిస్తూ తెలుగు వారి హృద‌యాల్లో ప్ర‌త్యేక స్థానాన్ని ద‌క్కించుకున్న వ‌న్ అండ్ ఓన్లీ 100 పర్సెంట్‌ తెలుగు ఓటీటీ మాధ్య‌మం ‘ఆహా’.  గ్లోబెల్ రేంజ్‌లో ప్ర‌తీసారి ఆహా వీక్ష‌కుల కోసం ఎగ్జ‌యిట్‌మెంట్‌ను పెంచుతూ అంద‌రి అంచ‌నాల‌ను మించేలా దూసుకెళ్తోంది. ఈ ఏడాది దీపావళికి ఆ ఎగ్జ‌యిట్‌మెంట్‌ను రెట్టింపు చేసేలా పండుగ ఆనందాల‌ను పీక్స్‌కు తీసుకెళ్లేలా ఆహా యాప్‌ను 2.0గా అప్‌గ్రేడ్ చేసి స‌రికొత్త ఫీచ‌ర్స్‌తో వీక్ష‌కుల‌కు అందిస్తూ సంబ‌రాల‌ను తీసుకొచ్చింది ఆహా. అందులో భాగంగా ‘ఐకాన్ స్టార్ ప్రెజెంట్స్ ఆహా 2.0’ కార్య‌క్ర‌మాన్ని హైద‌రాబాద్‌లో నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మానికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మాట్లాడుతూ ‘‘ఆహా ఇంత త్వ‌ర‌గా.. ఇంత‌ స‌క్సెస్ అవుతుంద‌ని అస‌లు అనుకోలేదు అన్నారు. అందుకు కార‌ణం ప్ర‌పంచంలోని తెలుగు ప్రేక్ష‌కులే.  ఒక నెంబ‌ర్ వ‌న్ తెలుగు ఓటీటీగా ఆహా ఉన్నందుకు నాకెంతో గ‌ర్వంగా ఉంది. దీని స‌క్సెస్‌కు కార‌ణమైన వ్య‌క్తులు గురించి మాట్లాడాలంటే ముందు మా నాన్న‌గారు అల్లు అర‌వింద్‌గారి గురించి మాట్లాడాలి. తెలుగు ప్రేక్ష‌కుల కోసం ఓ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఛానెల్ తీసుకు రావాల‌నే ఆలోచ‌న ఆయనదే. డెబ్బై ఏళ్లు వ‌య‌సు వ‌చ్చిన త‌ర్వాత కాస్త రిలాక్స్ అవుతూ, రిటైర్ అయ్యే స‌మ‌యంలో ఇంత పెద్ద ప్రాజెక్ట్ టేక‌ప్ చేసి పాతికేళ్ల లోపు పిల్ల‌ల‌తో హ్యాంగోవ‌ర్‌చేస్తూ వ‌చ్చిన మీరే ఆహాకు ఎన‌ర్జీ అంటూ అల్లు అరవింద్ పై ప్రశంసలు కురిపించారు బన్నీ.

అలాగే మీ వెంట‌నే నేను అంటూ మా వెన‌క నిల‌బ‌డిన దిల్‌రాజుగారికి స‌భా ముఖంగా థాంక్స్ చెప్పుకుంటున్నాను. వీరంద‌రూ లేక‌పోతే ఈ జ‌ర్నీ పూర్తయ్యేది కాదు. నా క్రియేటివ్ ప‌రంగా వంశీ పైడిప‌ల్లి పిల్ల‌ర్‌గా నిల‌బ‌డి ముందుకు న‌డిపించాడు. మూడేళ్లుగా అజిత్ ఇదే ప‌నిగా దీన్ని ఈ రేంజ్‌కు తీసుకొచ్చారు. అలాగే ఆహా టీమ్ పాత్ర ఎంతో ముఖ్యమైంది. ఆహాలో వెర్ష‌న్ 2.0 వ‌స్తుంది. ఇది ఎక్స్‌ట్రార్డిన‌రీ ఫ్లాట్‌ఫామ్‌. ఇది ఇంత బాగా రావ‌డానికి అల్లు వెంక‌టేశ్ కార‌ణం. ఈ స‌క్సెస్‌లో కార‌ణ‌మైన ఆహా టీమ్‌కు థాంక్స్‌’’ అంటూ చెప్పుకొచ్చారు అల్లు అర్జున్.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Sooryavanshi: ‘సూర్యవంశీ’లో ఎంఎస్ ధోని.. ఆసక్తి రేకిత్తిస్తోన్న గుల్షన్ గ్రోవర్ సీక్రెట్ పోస్ట్

Kalyan Dev’s Super Machi : లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా ‘సూపర్ మచ్చి’.. ఆకట్టుకుంటున్న టీజర్

Rajinikanth’s Peddanna Review: చెల్లెలి కోసం అన్న పడే ఆరాటం ‘పెద్దన్న’