Pushpa The Rise: ప్రీ రిలీజ్ బిజినెస్‌లో కూడా తగ్గేదే లే అంటున్న ‘పుష్ప’ రాజ్..

పుష్ప .. ఇప్పుడు తెలుగు ప్రేక్షకులంతా ఎదురుచూస్తున్న సినిమా. సుకుమార్  దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా త్వరలో పేక్షకుల ముందుకు రాబోతుంది.

Pushpa The Rise: ప్రీ రిలీజ్ బిజినెస్‌లో కూడా తగ్గేదే లే అంటున్న 'పుష్ప' రాజ్..
Pushpa
Follow us

|

Updated on: Dec 11, 2021 | 7:58 PM

Pushpa: పుష్ప .. ఇప్పుడు తెలుగు ప్రేక్షకులంతా ఎదురుచూస్తున్న సినిమా. సుకుమార్  దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా త్వరలో పేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాలో మునుపెన్నడూ కనిపించని ఊర మాస్ గా కనిపించనున్నాడు బన్నీ, గంధపు చెక్కల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బన్నీ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ బజ్ క్రియేట్ అయ్యింది. పుష్ప ద రైజ్ ప్రీ రిలీజ్ బిజినెస్ 250 కోట్ల మార్క్ ట‌చ్ చేసింది. అలవైకుంఠ‌పురంలో వంటి ఇండ‌స్ట్రీ హిట్ త‌రువాత అల్లు అర్జున్ నుంచి రాబోతున్న మూవీ కావ‌డంతో భారీ ధ‌ర‌ల‌కు పుష్ప ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్ లో రంగంస్థ‌లం వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ త‌రువాత రాబోతున్న మూవీ పుష్ప ది రైజ్ దీంతో అన్ని ఏరియాల్లో ప్రీ రిలీజ్ బిజినెస్ కి ఫ్యాన్సీ రేట్లు పలుకుతున్నాయి.

వీరిద్దరి కాంబినేష‌న్ లో వ‌స్తున్న హ్యాట్రిక్ మూవీ కావ‌డంతో ప్రీ రిలీజ్ ట్రేడ్ కి అనూహ్య స్పంద‌న‌ లభిస్తుంది. తెలుగు, త‌మిళ‌, మ‌ళ‌యాలం, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో థియేట్రిక‌ల్ అలానే నాన్ థియేట్రిక‌ల్ (ఓటిటి, డిజిటిల్ రైట్స్) క‌లుపుకొని 250 కోట్లుకు రిలీజ్ కి ముందే బిజినెస్ దక్కించుకుంది పుష్ప ది రైజ్. ఇక తొలిసారిగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, పాన్ ఇండియా సినిమా చేస్తుండ‌టంతో పుష్ప ది రైజ్ పై సినిమా బిజినెస్ వ‌ర్గాల్లో ఆస‌క్తి పెరిగింది. పుష్ప ది రైజ్  భారీ అంచ‌నాల‌తో డిసెంబ‌ర్ 17న అయిదు భాష‌ల్లో గ్రాండ్ గా విడుద‌ల కానుంది. ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ డిసెంబర్ 12 ( ఆదివారం ) జరగనుంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

N Chandrababu Naidu : బాలయ్య ‘అఖండ’ సినిమా పై చంద్రబాబు కామెంట్స్.. ఏమన్నారంటే..

Young Heroines 2021: ఈ ఏడాది తెలుగు కుర్రాళ్ళ మనసులు దోచేసిన కొత్త ముద్దుగుమ్మలు వీరే..

Ram Charan-Jr NTR: ఎన్టీఆర్‌ను నడుముపై గిల్లిన చరణ్.. తారక్ రియాక్షన్ చూడండి