Pushpa Shooting: కోలుకున్న సుకుమార్‌.. చిన్న బ్రేక్‌ తర్వాత మళ్లీ మొదలైన పుష్ప షూటింగ్‌. హైదరాబాద్‌లో…

Pushpa Shooting: అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం 'పుష్ప'. ఆర్య, ఆర్య2 వంటి సూపర్‌ హిట్‌ చిత్రాల తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తోన్న సినిమా కావడంతో...

Pushpa Shooting: కోలుకున్న సుకుమార్‌.. చిన్న బ్రేక్‌ తర్వాత మళ్లీ మొదలైన పుష్ప షూటింగ్‌. హైదరాబాద్‌లో...
Pushpa Shootng

Updated on: Jul 28, 2021 | 2:01 PM

Pushpa Shooting: అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఆర్య, ఆర్య2 వంటి సూపర్‌ హిట్‌ చిత్రాల తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తోన్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీగా అంచనాలున్నాయి. ఇక ఎర్రచందనం స్మగ్లింగ్‌ అనే విభిన్న కాన్సెప్ట్‌తో తెరకెక్కుతోన్న సినిమా కావడంతో దీనిపై మరిన్ని అంచనాలు పెరిగాయి. పాన్‌ ఇండియా చిత్రంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. టీజర్‌, ఫస్ట్‌ లుక్‌తోనే సినిమాపై హైప్‌ వచ్చేలా చేశాడు సుకుమార్‌. ఇదిలా ఉంటే మారేడిమిల్లి అనే అటవీ ప్రాంతంలో సుదీర్ఘంగా షూటింగ్‌ జరుపుకున్న పుష్ప టీమ్‌ తాజాగా హైదారాబాద్‌కు షిప్ట్‌ అయ్యింది. కరోనా నిబంధనల తర్వాత సినిమా షూటింగ్‌ కూడా ప్రారంభమైంది. అయితే అదే సమయంలో దర్శకుడు సుకుమార్‌ ఆరోగ్యం సహకరించకపోవడంతో కొన్ని రోజుల పాటు సినిమా చిత్రీకరణ ఆగిపోయింది.

ఇక తాజాగా సుకుమార్‌ అనారోగ్య నుంచి కోలుకోవడంతో షూటింగ్‌ మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అల్లుఅర్జున్‌పై కొన్ని సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ప్రస్తుతం ఈ షూటింగ్‌ హైదరాబాద్‌లో జరుగుతోంది. సినిమా చిత్రీకరణను శరవేగంగా పూర్తి చేసి అనుకున్న సమయానికి విడుదల చేయడానికి చిత్రయూనిట్‌ సన్నాహాలు చేస్తోంది. ఇక ఈ సినిమాలో అందాల తార రష్మిక మందన తొలిసారి బన్నీకి జోడిగా నటిస్తోంది. అన్ని సినిమాల్లో స్టైలిష్‌ లుక్‌తో ఆకట్టుకుంటూ వచ్చిన బన్నీ.. పుష్పలో మాత్రం ఫుల్‌ లెంత్‌ మాస్‌ లుక్‌లో కనిపించనున్నాడు. ఎన్నో అంచనాల మధ్య తెరకెక్కుతోన్న ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద ఎలాంటి వండర్స్‌ క్రియేట్‌ చేస్తోందో చూడాలి.

Also Read: Anchor Syamala: ఉయ్యాలో.. జంపాలో.. కొడుకుతో ఆటలాడుతున్న స్టార్‌ యాంకర్

Sonu Sood: రోడ్డుపక్కన ఉన్న జూస్ షాపులో సడన్‌‌‌గా ప్రత్యక్షమైన సోనూసూద్ ..

SR Kalyana Mandapam: ఆకట్టుకొంటున్న ‘ఎస్ఆర్ కళ్యాణమండపం’ మూవీ ట్రైలర్..