iBomma Ravi: తెలంగాణ రియల్ హీరో ఐబొమ్మ రవి అంటూ ఆటోపై పోస్టర్.. నెట్టింట వైరల్..

ఓవైపు పోలీసులు... మరోవైపు ఈడీ... లేటెస్ట్‌గా సీఐడీ...! ఇలా ఐబొమ్మ రవిపై ముప్పేట దాడికి దిగారు అధికారులు. ఇంతపెద్ద పైరసీ రాకెట్‌ను రవి ఒక్కడే రన్‌ చేశాడా...? రవి పార్ట్‌నర్స్‌ ఎవరు...? అతడ్ని వెనకుండి నడిపిస్తున్నదెవరు...? ఇప్పటిదాకా రవి వెనకేసింది ఎంత...? ఈ క్వశ్చన్స్ అన్నింటికి రవి నుంచి ఆన్సర్స్ రాబట్టేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మరోవైపు సోషల్ మీడియాలో మాత్రం అతనికి హీరో రేంజ్ ఎలివేషన్ కనిపిస్తుంది.

iBomma Ravi: తెలంగాణ రియల్ హీరో ఐబొమ్మ రవి అంటూ ఆటోపై పోస్టర్.. నెట్టింట వైరల్..
Ibomma Ravi

Updated on: Nov 23, 2025 | 7:20 PM

పోలీసుల వెర్షన్‌లో అతడో పైరసీ దొంగ. టాలీవుడ్ కోణంలో అతడో రాబిన్‌హుడ్.. సామాన్యుల మాటల్లో అతడో చిన్నపాటి దేవుడు. ఇలా ఐబొమ్మ రవి చుట్టూరా ఒక రక్తి కట్టించే వెబ్‌సిరీస్ పరుగులు పెడుతోంది.  రవి..ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో టాక్‌ ఆఫ్‌ది టౌన్‌గా మారాడు. ఎవడైనా దొంగ దొరికితే, చట్టప్రకారం శిక్షించండి అన్నది అన్ని వర్గాల నుంచి వచ్చే మాట. కానీ ఐబొమ్మరవిని దొంగ అంటూనే దేవుడుగా కీర్తిస్తోంది ప్రేక్షకుల లోకం. అసలు దొంగలు టాలీవుడ్‌లోనే ఉన్నారంటూ రివర్స్ అటాక్‌కు దిగుతున్నారు మరికొందరు. ఎవరి వాదన ఎలా ఉన్నా..ఇప్పుడు ఐబొమ్మరవి రాబిన్‌హుడ్‌తో పోల్చుతున్నారు.

ఐబొమ్మరవికి సోషల్‌ మీడియాలో రోజురోజుకు మద్దతు పెరుగుతోంది. సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలలో ‘ఐబొమ్మ’ ట్రెండింగ్‌లో ఉంది. పేదలు, మధ్య తరగతి వాళ్ల కోసమే పైరసీ చేశాడంటూ పోస్టులు పెడుతున్నారు. థియేటర్ రేట్లు భారీగా పెంచడం వల్లే ఐబొమ్మకు అలవాటు పడ్డామంటూ ట్వీట్లు కూడా వస్తున్నాయి. సామాన్యులకు అందనంత రేట్లు పెంచి సినిమా థియేటర్లకు రానివ్వని పరిస్థితి తీసుకొచ్చింది టాలీవుడ్‌లోని కొందరు పెద్దలే అంటూ ఐబొమ్మరవిని దేవుడిని చేసి చూస్తోంది ప్రేక్షకలోకం. అతడు తమ దృష్టిలో హీరో అని, అసలు విలన్ టాలీవుడే అని పాయింట్‌తో ఐబొమ్మ రవికి అండగా నిలుస్తున్నారు కొందరు ప్రేక్షకులు. తాజాగా ఖమ్మంలో ఓ ఆటో డ్రైవర్ తన వాహనంపై ఏకంగా ఇమ్మది రవి ఫోటో వేయించాడు. తెలంగాణ రియల్ హీరో ఐబొమ్మ రవి అంటూ అక్కడ రాసుకొచ్చాడు. ప్రజంట్ ఆ దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఈరేంజ్‌లో ఐబొమ్మరవికి సపోర్ట్ వస్తుందని పోలీసులు, ఇటు టాలీవుడ్‌ పెద్దలు కూడా ఊహించలేదు. రవిని హీరోగా చూడటాన్ని ఇండస్ట్రీ ఖండిస్తోంది. ఐబొమ్మ రవిని సోషల్ మీడియా దేవుడిగా చూడటం మానుకోవాలని విజ్ఞప్తి చేస్తోంది. అయితే ఐ-బొమ్మ రవి అరెస్ట్‌పై సీనియర్ అడ్వొకేట్, నటుడు CVL నరసింహారావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఐ బొమ్మ రవిని అంతా రాబిన్‌హుడ్‌లా చూస్తున్నారని, ప్రజలు ఇబ్బందులు పడితే.. సినిమాల్లో మాదిరిగా ఒకడు పుట్టుకొస్తాడని రవి నిరూపించాడన్నారు. ఆయన వెర్షన్‌లో అయితే సైబర్ క్రైమ్‌ను అడ్డుకునేందుకు ఐబొమ్మ రవిని డిపార్ట్‌మెంట్‌లోకే తీసుకోవాలని అప్పీల్ చేస్తున్న పరిస్థితి. ఈరేంజ్‌లో ఐబొమ్మరవికి క్రేజ్ పెరిగింది.

Follow Us