Actress Meena : మరోసారి రెండవ పెళ్లిపై మీనా ఆసక్తికర కామెంట్స్.. ఈసారి ఏమన్నారంటే..
ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో చక్రం తిప్పిన హీరోయిన్లలో మీనా ఒకరు. చైల్డ్ ఆర్టిస్టుగా ఎంట్రీ ఇచ్చి.. ఆ తర్వాత కథానాయికగా అనేక హిట్ చిత్రాల్లో నటించారు. ఇప్పటికీ సినిమాల్లో యాక్టివ్ గా ఉంటూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. తాజాగా తన రెండో పెళ్లి గురించి వస్తున్న రూమర్స్ పై మరోసారి స్పందించారు మీనా. ఇంతకీ ఆమె ఏమన్నారంటే.

హీరోయిన్ మీనా గురించి దక్షిణాది సినీప్రియులకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చైల్డ్ ఆర్టిస్టుగా సినీరంగంలోకి అడుగుపెట్టి తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషలలో అనేక హిట్ చిత్రాల్లో నటించి మెప్పించారు. ఆ తర్వాత కథానాయికగా తనకంటూ ఓ బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి, వెంకటేశ్, బాలకృష్ణ, నాగార్జున, రజినీకాంత్ వంటి స్టార్ హీరోలతో ఎన్నో హిట్ చిత్రాల్లో నటించారు. అప్పట్లో మీనాకు ఉండే ఫాలోయింగ్ వేరే. అందం, అభినయంతో సిల్వర్ స్క్రీన్ పై మంచి గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాదు.. ఒకప్పుడు యూత్ ఫేవరేట్ హీరోయిన్ సైతం ఆమెనే. పెళ్లి తర్వాత కొన్నాళ్లు సినిమాలకు దూరమైనప్పటికీ.. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా కనిపిస్తూ ఇండస్ట్రీలో యాక్టివ్ గా ఉంటుంది.
ఇవి కూడా చదవండి : Actress : తెలుగులో తోపు హీరోయిన్.. ఇప్పుడు బడా నిర్మాత.. పవన్ కళ్యాణ్, మహేష్ బాబుతో బ్లాక్ బస్టర్ హిట్స్..
ఇదెలా ఉంటే.. కెరీర్ మంచి ఫాంలో ఉన్నప్పుడే చెన్నైకు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ విద్యాసాగర్ ను 2009లో పెళ్లి చేసుకున్నారు మీనా. ఈ దంపతులకు ఒక పాప ఉంది. అయితే పెళ్లి తర్వాత కొన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉన్న మీనా.. ఆ తర్వాత రీఎంట్రీ ఇచ్చి.. వరుస సినిమాలతో బిజీగా మారింది. మీనా భర్త 2022లో అనారోగ్య సమస్యలతో మరణించిన సంగతి తెలిసిందే. భర్త మరణం తర్వాత తన కూతురిని చూసుకుంటూ సినిమాల్లో నటిస్తుంది. కానీ ఆమె మరో పెళ్లి చేసుకోబోతున్నారంటూ ఇదివరకు చాలా రూమర్స్ వినిపించాయి. త్వరలోనే ఆమె రెండో పెళ్లి చేసుకోబోతున్నారనే రూమర్స్ రావడం.. వాటిని మీనా ఖండించడం జరుగుతూనే ఉంది.
ఇవి కూడా చదవండి : Suryavamsham : హీరోగా సూర్యవంశం సినిమా చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు ఎలా ఉన్నాడో చూశారా.. ?
తాజాగా మరోసారి తన పర్సనల్ లైఫ్ గురించి స్పందించింది మీనా. జనాలకు తన పెళ్లి గురించి ఎందుకు ఆసక్తిగా ఉంటారో అర్థం కాదని తెలిపింది. “ఎప్పుడూ నా పెళ్లి గురించి మాట్లాడుతుంటారు. నాకు లేని ఇంట్రెస్ట్ వీళ్లందరికీ ఉండడం ఏంటో నాకు తెలియదు. ప్రస్తుతం నేను నా కూతురితో చాలా సంతోషంగా ఉన్నాను. నాకు మరో పెళ్లి చేసుకోవాలనే ఆలోచన లేదు. ఏ హీరో విడాకులు తీసుకున్నా నా పెళ్లితో ముడిపెడుతున్నారు. ఆ నటుడిని రెండో పెళ్లి చేసుకుంటుందంటూ ప్రచారం చేస్తున్నారు. అందులో ఎలాంటి నిజం లేదు. ఇప్పుడు నేను నటనకు ప్రాధాన్యం ఇస్తున్నాను” అంటూ చెప్పుకొచ్చింది. దీంతో మరోసారి మీనా పెళ్లి వార్తలకు చెక్ పడింది.
ఇవి కూడా చదవండి : Actress : కోట్లలో అప్పులు.. తినడానికి తిండి లేక తిప్పలు.. ఇప్పుడు వందల కోట్లకు మహారాణి ఈ బిగ్ బాస్ బ్యూటీ..
