
తమిళ హీరో కమ్ మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాశ్ కుమార్, గాయని సైంధవి విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి విడాకులకు కారణం హీరోయిన్ దివ్యభారతి అంటూ సోషల్ మీడియాలో పలు కథనాలు వచ్చాయి. అలాగే కొందరు విమర్శలు కూడా గుప్పించారు. వీటిని ఆమె ఖండించింది కూడా.. అయితే తాజాగా మరోసారి ఆమె ఇన్‌స్టా వేదికగా ఓ పోస్ట్ పెట్టింది.
‘నాకు సంబంధం లేని విషయాల్లోకి నా పేరు లాగుతున్నారు. జీవి ప్రకాశ్ కుటుంబ విషయాలతో నాకు ఎలాంటి సంబంధం లేదు. ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే.. నేను ఏ హీరోను డేటింగ్ చేయను. ముఖ్యంగా పెళ్లి అయిన వ్యక్తీతో డేటింగ్ చేయను. సరైన ఆధారాలు లేకుండా రూమర్స్ సృష్టించకండి. ఇప్పటిదాకా ఈ విషయంలో మౌనంగా ఉన్నాను. కానీ కొన్ని రోజులుగా ఈ రూమర్స్ హద్దులు దాటాయి. వీటి వల్ల నా పేరు డ్యామేజ్ అవుతోంది. ఈ ఫేక్ రూమర్స్ బదులు సమాజానికి అవసరమయ్యే వాటి గురించి ఆలోచించండి. నా వ్యక్తిగత గోప్యతను గౌరవించండి. ఈ విషయంపై ఇదే నా మొదట.. చివరి ప్రకటన’ అని హీరోయిన్ దివ్యభారతి తెగేసి చెప్పింది.
గతంలోనూ జీవి ప్రకాశ్ దంపతుల విడాకులపై దివ్యభారతి స్పందించింది. వారి విడాకులకు తానే కారణమని ఎందరో విమర్శించారని చెప్పింది. తనను తిడుతూ మెసేజ్‌లు పెట్టారని ఆవేదన వ్యక్తం చేసింది. కాగా, జీవి ప్రకాశ్, దివ్యభారతి కలిసి ‘బ్యాచిలర్’, ‘కింగ్‌స్టన్’ లాంటి సినిమాల్లో నటించారు. ఈ రెండూ కూడా బాక్సాఫీస్ వద్ద అద్భుత విజయాలు అందుకున్నాయి.