Sumalatha Ambareesh : సీనియర్ నటి, మాండ్య ఎంపీ సుమలత జులై మొదటివారంలో కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. అయితే ఆమె హెమ్ ఐసోలేషన్ లో ఉండి..చికిత్స తీసుకుని పూర్తిగా కోలుకున్నారు. తాను ప్లాస్మాను దానం చేసేందుకు సిద్ధంగా ఉన్నానని, అందుకు వైద్యుల అనుమతి కోసం వేచి చూస్తున్నట్టు సుమలత తెలిపారు.
‘కరోనా నుంచి కోలుకున్న తరువాత 28 రోజుల పాటు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఆ తరువాత యాంటీజెన్ టెస్టు ద్వారా శరీరంలోని ఇమ్యూనిటీ, యాంటీబాడీస్ స్థాయిని నిర్థారించాల్సి ఉంది. ఒకవేళ శరీరంలో యాంటీబాడీస్ అధికంగా ఉంటే ప్లాస్మా దానం చేయడానికి నేను రెడీ’ అని సుమలత పేర్కొన్నారు.
తాను కోవిడ్ నుంచి కోలుకోవడానికి.. దేశం కోసం యుద్దం చేసే సైనికుల్లా పోరాడనని తెలిపారు. తాను ఇప్పుడు పూర్తిగా కోలుకోని నార్మల్ అయ్యాయని, అందుకే పట్టుదలే కారణమని పేర్కొన్నారు. తాను వ్యాధి బారిన పడ్డప్పుడు ఎంతో మంది ప్రార్థనలు చేశారని, కుమారుడు తనను చిన్న పిల్లాలా చూసుకున్నాడని వెల్లడించారు. తన మానసిక, శారీరకంగా ఫిట్ గా ఉండేందుకు న్యూట్రిషన్స్ ఉండే ఫుడ్ తీసుకున్నానని, యోగా చేసినట్లు ఆమె తెలిపారు.
కాగా సుమలత ప్రజలకు ప్రత్యేక అభ్యర్థన చేశారు. కోవిడ్-19 బారిన పడిన వారిని వెలివేసినట్టు చూడొద్దని, కుదిరితే వారిలో మానసిక బలాన్ని నింపాలని కోరారు. వ్యాధితో బాధపడుతోన్నవారు కోలుకునేందుకు చేయూత చాలా అవసరమని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి ఆమె ప్రత్యేకంగా ఓ వీడియో విడుదల చేశారు.
Read More : ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల ఇంట విషాదం