Nandamuri Chaitanya Krishna: “ఐ డోంట్ కేర్”.. మరోసారి తారక్ ఫ్యాన్స్‌ను హెచ్చరించిన చైతన్య కృష్ణ
నందమూరి చైతన్య కృష్ణ బహిరంగంగా ఇలా జూ ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ను హెచ్చరించడం వివాదానికి తెర లేపింది. సాధారణంగా ఇలాంటి విషయంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో చాలా వేగంగా స్పందింస్తూ ఉంటారు. అందుకే నందమూరి ఫ్యామిలీ మెంబర్ అయిన చైతన్యను కూడా వదలడం లేదు. ఎన్టీఆర్ జోలికి వస్తే వదిలేది లేదని వార్నింగ్ ఇస్తున్నారు.

నందమూరి చైతన్య కృష్ణ ఇటీవలే ‘బ్రీత్’ సినిమాతో థియేటర్లలో సందడి చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత చైతన్య కృష్ణపై సామాజిక మాధ్యమాల్లో భారీగా ట్రోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ ట్రోలింగ్‌పై ఆయనెెప్పుడు పెద్దగా రియాక్ట్ అవ్వలేదు. అయితే తాజాగా చైతన్య కృష్ణ జూ ఎన్టీఆర్ ఫ్యాన్స్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏకంగా జాగ్రత్తగా ఉండండి అంటూ వార్నింగ్ ఇచ్చారు. ఈ మేరకు తన ఫేస్ బుక్ అకౌంట్‌లో ఓ పోస్ట్ పెట్టారు చైతన్య కృష్ణ.
జూ ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కి ఇదే నా హెచ్చరిక. వైసీపీకి అందులోనూ ముఖ్యంగా కొడాలి నాని, వల్లభనేని వంశీకి మద్దతు ఇచ్చిన జూ ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కి నేను చెప్పేది ఒక్కటే. మీరు వైసీపీకి సపోర్ట్ చేశామని అంటున్నారు.. అయినా మీరు ఎవరూ మా బొ…. కూడా పీ…. నేను ఉండగా చంద్రబాబు నాయుడు మావయ్య, నందమూరి బాలకృష్ణ బాబాయ్‌లను టచ్ కూడా చేయలేరు. నా సినిమా రిలీజ్ అయినప్పుడు కూడా మీరు (జూ ఎన్టీఆర్ ఫ్యాన్స్), వైసీపీ కలిసి నన్ను బాగా ట్రోల్ చేశారు. జాగ్రత్తగా ఉండండి” అంటూ చైతన్య కృష్ణ వార్నింగ్ ఇచ్చారు.
అయితే ఈ పోస్ట్‌పై జూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అదే స్థాయిలో రియాక్ట్ అయ్యారు. సోషల్ మీడియాలో ఈ పోస్టును షేర్ చేస్తూ చైతన్య కృష్ణపై ఓ రేంజ్‌లో విరుచుకుపడుతున్నారు. అసలు జూ ఎన్టీఆర్‌ను ఇందులోకి లాగాల్సిన అవసరం ఏముంది అంటూ ప్రశ్నిస్తున్నారు. ఎలక్షన్స్ అయిపోయాక ఈ పోస్టు పెట్టడమేంటని, ఎన్నికలకి ముందు పెట్టుంటే ఎన్టీఆర్ పవర్ తెలిసేదంటూ కామెంట్లు చేస్తున్నారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ నుంచి తీవ్ర స్థాయిలో రియాక్షన్ రావడంతో.. చైతన్య కృష్ణ మరోసారి రెస్పాండ్ అయ్యారు. సోషల్ మీడియాలో కొత్త పేజీలు క్రియేట్ చేసి మరీ.. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ తనను తిడుతున్నారని.. తన వాట్సాప్, ఫేస్ బుక్‌కు అదే పనిగా సందేశాలు పంపిస్తున్నారని పేర్కొన్నారు. ఈ మేరకు తనను దూషించిన ఖాతాలకు సంబంధించిన కొన్ని స్క్రీన్ షాట్లను ఈ పోస్టుకు జత చేశారు. బట్ ఐ డోంట్ కేర్ అంటూ తను చెప్పాలనుకున్న మాటను సూటిగా చెప్పేశారు చైతన్య కృష్ణ.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
