Hyper Aadi: హైపర్ ఆది సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నాడా..? వైరల్ అవుతోన్న మ్యారేజ్ ఫోటో

|

Dec 04, 2022 | 7:07 PM

ఇక అటు బుల్లి తెరపై నవ్వులు పూయిస్తూనే... వెండి తెరపై కూడా కమెడియన్‌ గా ఛాన్సులు కొట్టేశారు. కాని అక్కడ ఆయన కామెడీ వర్కవుట్ కాకపోవడంతో.. టెలివిజన్‌ తెరపైనే... తన క్రేజ్ పెంచుకోవడాన్ని షురూ చేశారు.

Hyper Aadi: హైపర్ ఆది సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నాడా..? వైరల్ అవుతోన్న మ్యారేజ్ ఫోటో
Hyper Aadi
Follow us on

జబర్దస్త్ కామెడీ షోతో.. బుల్లి తెరకు పరిచయమై రాణిస్తున్న వారు చాలా మంది ఉన్నారు. కొంతమంది సినిమాల్లో అవకాశాలు కూడా వచ్చాయి. ఇక బుల్లితెర పై స్టార్ కమెడియన్ గా రాణిస్తున్న వారిలో హైపర్ ఆది ఒకరు. తనకే సాధ్యమైన పంచులతో.. ఫన్నీ వేశాలతో.. అందర్నీ ఆకట్టుకుంటున్నారు ఆది. ఇక అటు బుల్లి తెరపై నవ్వులు పూయిస్తూనే… వెండి తెరపై కూడా కమెడియన్‌ గా ఛాన్సులు కొట్టేశారు. కాని అక్కడ ఆయన కామెడీ వర్కవుట్ కాకపోవడంతో.. టెలివిజన్‌ తెరపైనే… తన క్రేజ్ పెంచుకోవడాన్ని షురూ చేశారు. తనకొచ్చిన ప్రతీ షోలోనూ నవ్వులు పూయిస్తూ… హీరోలతో సమానంగా క్రేజ్‌ సంపాదించుకున్నారు. తనకంటూ ఫ్యాన్ బేస్ క్రియేట్ అయ్యేలా చేసుకున్నారు.

ఇక సోషల్ మీడియాలోనూ ఆదికి మంచి క్రేజ్ ఉంది. మీమ్స్ రూపంలోనూ.. తన కామెడీ స్కిట్స్ ప్రోమోల రూపంలోనూ.. ఎప్పుడూ నెట్టింట వైరల్ అయ్యే హైపర్ ఆది… ఈ సారి మాత్రం ఓ పెళ్లి ఫోటోలతో నెట్టింట వైరల్ అవుతున్నారు. ఈ ఫోటో చూసి అందరు షాక్ అవుతున్నారు.

దీంతో ఆది నిజంగా పెళ్లి చేసుకున్నారా.? లేదానేది తేల్చుకోలేక జుట్టు పీక్కుంటున్నారు ఆయన ఫ్యాన్స్ . ఇక కొందరు నెటిజన్లేమో… ఏదైనా షో కోసం పెళ్లి చేసుకుని ఉండొచ్చు.. ఆ ఫోటోలు ఇప్పుడు వైరల్ కావచ్చని లైట్ తీసుకుంటున్నారు. అయినా ఆదికి పెళ్లైతే తనే సోషల్ మీడియాలో ఫోటోలు పెడతారుకదంటూ.. ఈ మ్యారట్ ను  లైట్ గా తీసుకుంటున్నారు. మరి ఈ ఫొటోల్లో నిజమెంత అన్నది తెలియాల్సి ఉంది. ఇప్పుడే కాదు గతంలో సుడిగాలి సుధీర్ పెళ్లి అని.. ఆది పెళ్లి చేసుకోబోతున్నాడని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే..

ఇవి కూడా చదవండి

Aadi