మంచు కుటుంబంంలో గొడవలు తారాస్థాయికి చేరాయి. హైదరాబాద్ జల్ పల్లిలోని మంచు మోహన్ బాబు ఇంటి వద్ద నిన్న రాత్రి తీవ్ర ఉద్రిక్తత నెలకొన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మోహన్ బాబు, మంచు మనోజ్ ఇద్దరూ ఒకరిపై మరొకరు పరస్పర ఆరోపణలు చేసుకుంటూ పోలీసులను ఆశ్రయించారు. ఈ క్రమంలోనే మంచు ఫ్యామిలీలోని గొడవను కవరేజ్ చేయడానికి వెళ్లిన మీడియాపై మోహన్ బాబు దాడి చేయడం తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనలో టీవీ9 ప్రతినిధి రంజిత్ తీవ్రంగా గాయపడ్డారు. అతడి కంటికి, చెవికి మధ్య మూడు చోట్ల జైగోమాటిక్ ఎముక విరిగినట్లు వైద్యులు తెలిపారు. టీవీ9 మీడియా ప్రతినిధి రంజిత్ పై దాడి చేసిన అనంతరం అక్కడి నుంచి మోహన్ బాబు, విష్ణు వెళ్లిపోయారు. ప్రస్తుతం మంచు మనోజ్ జల్ పల్లిలోని మోహన్ బాబు ఇంటిలోనే ఉన్నారు. మోహన్ బాబు ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. ఈ క్రమంలోనే మోహన్ బాబు, మంచు విష్ణు, మంచు మనోజ్ కు పోలీసులు నోటీసులు జారీ చేశారు.
మీడియాపై మోహన్ బాబు దాడి చేసిన ఘటనపై పోలీస్ శాఖ సీరియస్ అయ్యింది. ఈ క్రమంలోనే మోహన్‌బాబు బౌన్సర్లను బైండోవర్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అలాగే మోహన్‌బాబు, విష్ణు గన్‌లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఫిల్మ్ నగర్ పోలీసులు మంచు మోహన్ బాబు, విష్ణు నుంచి తుపాకులను స్వాధీనం చేసుకున్నారు. అలాగే బుధవారం ఉదయం 10:30 గంటలకు విచారణకు హాజరుకావాలని రాచకొండ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే మోహన్ బాబు నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు.
జర్నలిస్టుపై దాడికి దిగడంతో మోహన్ బాబుకు వ్యతిరేకంగా పలువురు జర్నలిస్టులు ఆందోళన చేపట్టారు. మీడియాపై దాడికి నిరసనగా ఆయన ఇంటి వద్ద బైఠాయించి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మరోవైపు మోహన్ బాబు ఆసుపత్రిలో చేరారు. గచ్చిబౌలిలోని కాంటినెంటర్ ఆసుపత్రిలో ప్రస్తుతం ఆయనకు చికిత్స అందిస్తున్నట్ల సమాచారం. ఆయన వెంట పెద్ద కుమారుడు విష్ణు ఉన్నారు.
Vijay Sethupathi: విజయ్ సేతుపతి ఇన్ స్టాలో ఫాలో అవుతున్న ఏకైక హీరోయిన్.. ఎవరో తెలుసా..?
Tollywood : గ్యాంగ్‌స్టర్‌తో ప్రేమలో పడి కెరీర్ నాశనం చేసుకున్న హీరోయిన్.. ఇండస్ట్రీకి దూరం..
Actress Gajala: వాసి వాడి తస్సాదియ్యా.. అందాలతో హార్ట్ ఎటాక్ తెప్పిస్తోన్న ఎన్టీఆర్ హీరోయిన్..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.