సంధ్య థియేటర్‌కు షోకాజ్ నోటీసులు ఇచ్చారు పోలీసులు. థియేటర్ లైసెన్స్ ఎందుకు రద్దు చేయకూడదో.. తెలపాలంటూ నోటీసులు జారీ చేసిన పోలీసులు. తొక్కిసలాట ఘటనలో 12 లోపాలు గుర్తించిన పోలీసులు
10 రోజుల్లో వివరణ ఇవ్వాలన్న పోలీసులు తెలిపారు. పుష్ప 2 సినిమా ప్రీమియర్ సందర్భంగా జరిగిన తిక్కిసలాట లో ఓ మహిళా మృతి చెందిన విషయం తెలిసిందే. ఫ్యామిలీతో కలిసి సినిమా చూడటానికి వెళ్లిన ఓ కుటుంబంలో విషాదం నెలకొంది. పుష్ప హీరో అల్లు అర్జున్ థియేటర్ కు రావడంతో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో తల్లి కొడుకు గాయపడ్డారు. తల్లి అక్కడికక్కడే మృతిచెందగా.. కొడుకు చావుబ్రతుకుల మధ్య హాస్పటల్ లో చికిత్సపొందుతున్నాడు.
దాంతో ఈ ఘటన పై పోలీసులు సీరియస్ అయ్యారు. థియేటర్ యాజమాన్యం పై అలాగే నటుడు అల్లు అర్జున్ పై కేసు నమోదు చేశారు. ఇప్పటికే ఏడుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు కూడా. అలాగే అల్లు అర్జున్ ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. డిసెంబర్ 13న పోలీసులు అల్లు అర్జున్ ను అరెస్ట్ చేశారు. అనంతరం ఆయనను నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు.
కోర్టు అల్లు అర్జున్ కు 14 రోజులు రిమాండ్ విధించింది. అయితే వెంటనే హైకోర్టును ఆశ్రయించడంతో అల్లు అర్జున్ కు మధ్యంతర బెయిల్ ను మంజూరు చేసింది న్యాయస్థానం. దాంతో అల్లు అర్జున్ ను వెంటనే విడుదల చేయాలని పోలీసులను ఆదేశించింది కోర్టు. అయితే అప్పటికే అల్లు అర్జున్ ను చంచల్ గూడ జైలుకు తరలించారు పోలీసులు. ఆతర్వాత విడుదల ప్రాసెస్ లెట్ అవ్వడంతో ఒక రాత్రంతా అల్లు అర్జున్ ను జైల్లోనే ఉంచారు పోలీసులు మరుసటి రోజు ఉదయాన్నే ఆయనను విడుదల చేశారు. కాగా ఇప్పుడు సంధ్య థియేటర్‌కు షోకాజ్ నోటీసులు ఇచ్చారు పోలీసులు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.