
కథలో బలముంటే చాలు సినిమాలు చేస్తూ అలరిస్తున్నారు యంగ్ హీరో సుధీర్ బాబు. తాజాగా ఈ కుర్ర హీరో నటించిన లేటెస్ట్ మూవీ ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి. మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయింది. ఇక ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ కథతో రానున్నాడు. ఈ సినిమాకు హంట్ అనే టైటిల్ ను ఖరారు చేశారు. భవ్య క్రియేషన్స్ పతాకంపై వి. ఆనంద ప్రసాద్ నిర్మిస్తున్నసినిమా ‘హంట్’. మహేష్ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకాంత్, ‘ప్రేమిస్తే’ ఫేమ్ భరత్ ప్రధాన పాత్రలు పోషించారు. ఇదిలా ఉంటే హంట్ టైటిల్ పై వివాదం రేగింది. ఈ టైటిల్ మాది అంటున్నారు డైరెక్టర్ , హీరో నిక్షిత్
శ్రీ క్రియేషన్స్ బ్యానర్ లో జూలై లొనే “హాంట్” అనే టైటిల్ ని రిజిస్ట్రేషన్ చేసుకున్నాం అని శ్రీ క్రియేషన్స్ బ్యానర్ తరఫున లాయర్ సురేష్ బాబు ద్వారా ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కి, భవ్య క్రియేషన్స్ బ్యానర్ వాళ్ళకి వారి టీం కి నోటీసులు పంపి ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డైరెక్టర్ & హీరో నిక్షిత్ మాట్లాడుతూ “తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ లో మొదటగా మేము టైటిల్ ని రిజిస్ట్రేషన్ చేసుకున్నాం, ఆ తర్వాత భవ్య క్రియేషన్స్ వారు అదే టైటిల్ ని అప్ప్లే చేసుకుంటే, రెండు ఫిల్మ్ ఛాంబర్ రిజెక్ట్ చేశారు, ఆ తరువాత అదే టైటిల్ ని ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ వారు భవ్య క్రియేషన్స్ వారికి టైటిల్ రిజిస్ట్రేషన్ ఆమోదం చేశారు.
ఛాంబర్ లో ముందు రిజిస్ట్రేషన్ చేసుకున్నాం అని మేము అడిగితే సమాధానం ఇవ్వకుండా మాట దాటేస్తున్నారు కొంతమంది సినీ పెద్దలు, అందుకోసం మా లాయర్ ద్వారా వాళ్లందరికీ నోటీసులు పంపించారు, మా టైటిల్ మాకు వచ్చే అంతవరకు న్యాయపరమైన పోరాటం చేస్తాం” అని తెలిపారు”. అలాగే అడ్వకేట్ సురేష్ బాబు మాట్లాడుతూ “శ్రీ క్రియేషన్స్ వారి తరపున నేను వకాలత్ నామా నేను తీసుకున్నాను, వీరి వైపు న్యాయం ఉంది, నేను కూడా ఒక నిర్మాతనే, నిర్మాతల బాధలు, వారి కష్టాలు నాకు తెలుసు, ఏ నిర్మాత నష్టపోకూడదు అనేది నా కోరిక, ఒక్క సారి రిజిస్ట్రేషన్ చేసుకున్న టైటిల్ ని వేరే ప్రొడ్యూసర్ కి ఆ టైటిల్ ని ఆమోదం చేయడం ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ తప్పిదమే, అందుకోసం వారి తరపున నేను వాదిస్తున్నాను అని అన్నారు. మరి ఈ వివాదం ఎప్పుడు ముగుస్తుందో చూడాలి.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..