Jr.NTR : ‘యుద్ధభూమిలో నీకోసం ఎదురుచూస్తుంటాను మిత్రమా’.. ఎన్టీఆర్‏కు హృతిక్ ట్వీట్..

|

May 20, 2023 | 3:35 PM

త్వరలోనే వార్ 2 సినిమాతో నార్త్ అడియన్స్ ముందుకు వెళ్తున్నారు. ఇందులో బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ సైతం మెయిన్ రోల్ పోషించనున్నాడు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఆసక్తికర ట్వీట్ చేశారు హృతిక్.

Jr.NTR : యుద్ధభూమిలో నీకోసం ఎదురుచూస్తుంటాను మిత్రమా.. ఎన్టీఆర్‏కు హృతిక్ ట్వీట్..
Ntr, Hrithik Roshan
Follow us on

నందమూరి హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్ డే నేడు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో అభిమానులు సంబరాలను ఘనంగా జరుపుతుండగా.. మరోవైపు థియేటర్లలో సింహాద్రి రీరిలీజ్ సందడి నెలకొంది. ఇక తారక్‏కు సోషల్ మీడియా వేదికగా ఫ్రెండ్స్, ఫ్యాన్స్, సినీ ప్రముఖులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అయితే ట్రిపుల్ ఆర్ మూవీతో ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ ఇమేజ్ సొంతం చేసుకున్న తారక్ కు హాలీవుడ్ మేకర్స్ సైతం ఫ్యాన్స్ అయ్యారు. ఇక ఇప్పటివరకు తెలుగు తెరపై సందడి చేసిన ఎన్టీఆర్ ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నారు. త్వరలోనే వార్ 2 సినిమాతో నార్త్ అడియన్స్ ముందుకు వెళ్తున్నారు. ఇందులో బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ సైతం మెయిన్ రోల్ పోషించనున్నాడు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఆసక్తికర ట్వీట్ చేశారు హృతిక్.

“పుట్టినరోజు శుభాకాంక్షలు తారక్.. ఈరోజు పూర్తిగా సంతోషంగా గడపాలని కోరుకుంటున్నాను. యాక్షన్ ప్యాక్డ్ ఇయర్ ముందుంది. యుద్ధభూమిలో నీ కోసం ఎదురు చూస్తున్నా మిత్రమా. మనం కలిసే వరకు ఆనందంగా.. ప్రశాంతంగా ఉండండి. పుట్టిన రోజు శుభకాంక్షలు మిత్రమా” అంటూ ట్వీట్ చేశారు హృతిక్. ఈ పోస్ట్ చూసిన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇద్దరు స్టార్స్ బిగ్ స్క్రీన్ చేసే మ్యాజిక్ కోసం వెయిట్ చేస్తున్నామంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ త్వరలోనే స్టార్ట్ కాబోతుంది. ఇందులో తారక్ నెగిటివ్ రోల్ పోషించనున్నాడు. మరోసారి ఈ సినిమాలో భయపెట్టే విలన్ పాత్రలో కనిపించబోతున్నారని టాక్ వైరలవుతుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.