AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Web Series: వణుకు పుట్టించే ట్విస్టులు, మైండ్ బ్లాంక్ అయ్యే సీన్‌లు.. మెంటలెక్కించే హారర్ వెబ్ సిరీస్

హారర్ సినిమాలు చూడాలంటే మీకు ఇష్టమా..? ఇప్పటికే ఓటీటీల్లో హారర్ థ్రిల్లర్స్, మిస్టరీ మూవీస్ అందుబాటులో ఉన్నాయి. కానీ ఇప్పుడు యూట్యూబ్ లో ఓ హారర్ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతుంది. ఊహించని ట్విస్టులు, వణికించే సీన్లతో ఆద్యంతం ఆసక్తిని కలిగిస్తుంది.

Web Series: వణుకు పుట్టించే ట్విస్టులు, మైండ్ బ్లాంక్ అయ్యే సీన్‌లు.. మెంటలెక్కించే హారర్ వెబ్ సిరీస్
Ott Movie
Rajitha Chanti
|

Updated on: Oct 18, 2024 | 12:55 PM

Share

ప్రస్తుతం ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో హరర్, సస్పెన్స్ థ్రిల్లర్, మిస్టరీ చిత్రాలకు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇటీవల అడియన్స్ కూడా ఇదే తరహా కంటెంట్ చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అందుకే అటు సినీ ప్రియులను ఆకట్టుకునేందుకు ఎక్కువగా హరర్ కామెడీ చిత్రాలను తీసుకువస్తున్నారు మేకర్స్. ఇతర భాషలలో సూపర్ హిట్ అయిన చిత్రాలను కూడా తెలుగులోకి డబ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ వెబ్ సిరీస్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఓ భాషలో రిలీజ్ అయిన వెబ్ సిరీస్ ను టాలీవుడ్, కోలీవుడ్ అనే భేదాలు లేకుండా అన్ని భాషలకు చెందిన అడియన్స్ చూస్తున్నారు. ఇప్పుడు ఆ సిరీస్ ఓటీటీలో కాకుండా యూట్యూబ్ లో ఫ్రీగా చూడొచ్చు. అదే కరువనమ్. తమిళంలో రూపొందించిన హారర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఇప్పుడు నేరుగా యూట్యూబ్ లో రిలీజ్ అయ్యింది. మొత్తం మూడు ఎపిసోడ్స్ ఉన్న సిరీస్ ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతుంది.

ఇప్పుడు యూట్యూబ్ లో ఈ వెబ్ సిరీస్ ట్రెండింగ్ లో ఉంది. ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో ఈ సిరీస్ అందుబాటులోకి తీసుకువచ్చారు మేకర్స్. ఇందులో ఉదయ సుందరి, జయ శ్రీ విజయన్, విఘ్నేష్ వరదరాజన్, వీరరాఘవన్ ప్రధాన పాత్రలు పోషించారు. కుమరన్ సుందరన్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్ ఆద్యతం ఊహించని ట్విస్టులు.. వణుకుపుట్టించే సీన్లతో ఆకట్టుకుంటుంది.

కథ విషయానికి వస్తే.. మీరా, షాలిని అనే ఇద్దరు అనాథలు ఓ ఆశ్రమంలో పెరుగుతుంటారు. వారిద్దరిని ఓ గొప్పింటి మహిళ దత్తత తీసుకుంటుంది. తల్లి మరణించడంతో ఆమె ఇంట్లో కొన్నాళ్లపాటు గడపాల్సి వస్తుంది. ఆ ఇంట్లో వారికి ఎలాంటి అనూహ్య పరిణామాలు ఎదురయ్యాయి ? అసలు వారిద్దరి తల్లి ఎలా చనిపోయింది.. అన్నదే అసలు కథ. ఈ సిరీస్ ఇంట్రెస్టింగ్ ట్విస్టులు, వణుకించే సీన్లతో ఆకట్టుకుంటుందని ఇప్పటికే రివ్యూస్ వచ్చాయి. ఈ సిరీస్ మొత్తం ఎనిమిది ఎపిసోడ్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మూడు ఎపిసోడ్స్ అందుబాటులో ఉన్నాయి.

ఇది చదవండి :

Bhadra Movie: వార్నీ.. ఏం ఛేంజ్ భయ్యా..’భద్ర’ మూవీలో రవితేజ మరదలు.. ఇప్పుడు చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే..

Actress Laya: అందంలో అమ్మను మించిపోయిన డాటర్.. హీరోయిన్ లయ కూతురిని చూశారా..?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.