Kanthara: సెన్సేషనల్ సినిమా కాంతారాకు సీక్వెల్ రాబోతోందా.? క్లారిటీ ఇచ్చిన నిర్మాతలు
ముందుగా కన్నడలో విడుదలైన కాంతార అక్కడ సూపర్ హిట్ గా నిలవడంతో పలు భాషల్లోకి డబ్ అయ్యి మంచి విజయాన్ని సొంతం. దాదాపు 16 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ ఏకంగా 450కోట్లకు పైగా వసూల్ చేసింది.
చిన్న సినిమాగా వచ్చి సంచలన విజయం సాధించిన సినిమాల్లో కాంతార ఒకటి . కన్నడ సినిమాగా వచ్చిన ఈ మూవీ పాన్ ఇండియా రేంజ్ లో హిట్ అందుకుంది. ముందుగా కన్నడలో విడుదలైన కాంతార అక్కడ సూపర్ హిట్ గా నిలవడంతో పలు భాషల్లోకి డబ్ అయ్యి మంచి విజయాన్ని సొంతం. దాదాపు 16 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ ఏకంగా 450కోట్లకు పైగా వసూల్ చేసింది. ఈ సినిమా పై సర్వత్రా ప్రశంసలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ సినిమాలో హీరో రిషబ్ శెట్టి నటన ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. క్లైమాక్స్ లో 20 నిముషాలు ప్రేక్షకులను సీట్ అంచున కూర్చోపెడుతుంది. త్వరలోనే ఈ సినిమాకు సీక్వెల్ రాబోతుందని గతకొద్దిరోజులుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. హోంబలే ఫిల్మ్స్ ప్రొడక్షన్స్ లో ఈ సినిమా తెరకెక్కింది. అయితే తాజాగా హోంబలే ఫిల్మ్స్ ప్రొడక్షన్స్ యాజమాన్యం మాట్లాడుతూ.. కాంతార సీక్వెల్ పై క్లారిటీ ఇచ్చారు.
కాంతార మూవీ నిర్మాతలు మాట్లాడుతూ.. మాకు కాంతార సీక్వెల్ చేసే ఆలోచన ఉంది. త్వరలోనే దీనిపై క్లారిటీ ఇస్తాం. ప్రస్తుతం రిషబ్ శెట్టి కొంత గ్యాప్ తీసుకున్నాడు. త్వరలోనే అతను తిరిగి రాగానే కాంతార సీక్వెల్ గురించి చర్చిస్తాం అని అన్నారు. దాంతో కాంతార మూవీ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
కన్నడిగులు సంప్రదాయమైన భూతకోల నేపథ్యంలో తెరకెక్కిన కాంతార సినిమాకు రిషబ్ శెట్టినే దర్శకత్వం వహించి నటించారు. ఈ సినిమాలో రిషబ్ శెట్టి నటన నెక్ట్స్ లెవల్ అనే చెప్పాలి. ఇక ఆస్కార్ కు కూడా ఈ సినిమాను రిఫర్ చేశారు నిర్మాతలు. ఆస్కార్ నామినేషన్స్ లో చోటు దక్కే అవకాశం ఉంది.