
ఇటీవల కొన్ని సినిమాలు సైలెంట్ గా ఓటీటీలోకి వస్తున్నాయి. ఎలాంటి ముందస్తు సమాచారం, ప్రకటన లేకుండా డిజిటల్ స్ట్రీమింగ్ లో సందడి చేస్తున్నాయి. అలా తాజాగా ఓ స్పోర్ట్స్ డ్రామా సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసింది. అదే ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ కమ్ హీరో
హిప్ హాప్ తమిళన్, యంగ్ హీరోయిన్ అనిఖా సురేంద్రన్ జంటగా నటించిన ‘పీటీ సర్’. ఎలాంటి అంచనాలు లేకుండా మే 24న విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది. విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. ప్రముఖ మూవీ రేటింగ్ ప్లాట్ ఫామ్ ఐఎమ్‌డీబీ సంస్థ కూడా పీటీ సర్ సినిమాకు 7.6 రేటింగ్ ఇచ్చింది. ఇలా ఎన్నో విశేషాలున్న ఈ సూపర్ హిట్ మూవీ ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా? అని సినీ జనాలు ఆసక్తిగా ఎదురుచూడసాగారు. ఇప్పుడు వీరి నిరీక్షణకు తెరదించుతూ పీటీ సర్ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. అది కూడా ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా . ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో పీటీ సర్ సినిమా కోసం ఎదురు చూస్తున్న వారికి అమెజాన్ ప్రైమ్ సడెన్ సర్ ప్రైజ్ ఇచ్చింది. సైలెంట్ గా ఈ సినిమాను డిజిటల్ స్ట్రీమింగ్ కు తీసుకొచ్చింది. అయితే ప్రస్తుతం ఈ మూవీ కేవలం తమిళంలోనే అందుబాటులో ఉంది. త్వరలోనే తెలుగులోకి కూడా డబ్ అయ్యే అవకాశముంది. ప్రస్తుతానికి మాత్రం ఇంగ్లిష్ సబ్ టైటిల్స్ తో పీటీ సర్ సినిమాను చూడొచ్చు.
పీటీ సార్ సినిమాకు కార్తీక్ వేణుగోపాలన్ రచన, దర్శకత్వంతోపాటు నిర్మాతగా వ్యవహరించారు. వెల్స్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ సినిమాకు హీరో అయిన హిప్హాప్ తమిళనే స్వరాలు సమకూర్చడం విశేషం. సీనియర్ నటులు ప్రభు, కె భాగ్యరాజ్, పాండియరాజన్, మునిష్కాంత్, త్యాగరాజన్, ఇళవరసు, దేవదర్శిని, పట్టిమండ్రం రాజా, వినోదిని తదితరులు ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషించారు. మాధేష్ మాణికం సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించగా, ప్రసన్న జీకే ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు. మరి వీకెండ్ లో మంచి సినిమాను చూడాలనుకుంటున్నారా? అయితే పీటీ సార్ సినిమాపై ఓ లుక్కేయండి
#StreamingAlert#PTSir is out for the OTT release.
Pt sir streaming now on @PrimeVideoIN pic.twitter.com/8tqysqFmwp— Movie times 🍿 𝕩 (@the_last_man00) June 21, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.