Tollywood: చిన్నప్పుడు స్కూల్లో టాపర్.. ఇప్పుడు ఇండస్ట్రీలో టాపర్.. ఎవరో గుర్తుపట్టారా..?
టాలీవుడ్‌లో వరుస విజయాలనందుకుని స్టార్‌హీరోయిన్‌గా ఎదిగింది ఈమె. మాతృభాష మలయాళంలో కూడా విరివిగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. మాతృభాషలో ఉన్నంత సౌకర్యం మిగతా భాషల్లో నటించేటప్పుడు ఉండదు కదా అని గతంలో ఆమె చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. ఇంతకే తనెవరో మీరు గుర్తుపట్టారా.. ?
సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్‌గా కెరీర్ సాగించడం అంత ఈజీ టాస్క్ కాదు. ఆనపకాయ అంత టాలెంట్‌తో పాటు ఆవగింజ అంత అదృష్టం కూడా ఉండాలి. అందం, అభినయం ఉన్నా.. కొందరికి అవకాశాలు పెద్దగా రావు. కానీ మీరు పైన ఫోటోలో చూస్తున్న అమ్మాయి మాత్రం అందుకు మినహాయింపు. తెలుగనాట అడుగుపెట్టడమే.. మంచి హీరో సినిమాతో అరంగేట్రం చేసి మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత వరుసగా విజయాలు నమోదు చేసింది. ఇంతకీ ఈ బ్యూటీ కేరళకు చెందనది. ఏమైనా ఐడియా వచ్చిందా. ప్రస్తుతం స్టార్ హీరోయిన్‌గా టర్న్ అవుతున్న ఈమె.. మరెవరో కాదు సంయుక్త మీనన్. యూత్‌లో ఈమెకు మస్త్ క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే. మొదటిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ మూవీతో సెకండ్ హీరోయిన్‌గా టాలీవుడ్‌కు పరిచయమైంది సంయుక్త. ఆ తర్వాత కల్యాణ్ రామ్ నటించిన బింబిసార, సాయి ధరమ్ తేజ్ సరసన విరూపాక్ష, ధనుష్ జోడిగా సార్ చిత్రాలతో వరస హిట్స్ అందుకుంది. దీంతో వరుస హిట్స్ అందుకుంటూ గోల్డెన్ హీరోయిన్ అన్న నేమ్ సంపాదించుకుంది.
తాజాగా సంయుక్త అందమైన క్షణాలను మిస్ అవుతున్నాను అంటూ స్కూల్ డేస్ ఫోటో షేర్ చేసింది. కాగా, ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది. అయితే పాఠశాలలో చదువుతున్న రోజుల్లో సంయుక్త స్కూల్ టాపర్ అట. ఇక విషయం తెలిసి మా హీరోయిన్ మల్టీ టాలెంటెడ్ అని కామెంట్స్ పెడుతున్నారు అభిమానులు. అయితే చివరిగా ఈమె కళ్యాణ్ రామ్ సరసన డెవిల్ చిత్రంలో కనిపించింది సంయుక్త. ఇటీవల వచ్చి లవ్ మీ చిత్రంలో కామియో రోల్ చేసింది. ప్రస్తుతం నిఖిల్ సిద్ధార్థ్ నటిస్తున్న స్వయంభూ సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా కోసం సంయుక్త స్వయంగా గుర్రపు స్వారీ కూడా నేర్చుకుంది. అటు మలయాళం, తమిళ ఇండస్ట్రీలలో కూడా అడపా దడపా సినిమాలు చేస్తూనే ఉంది. మహారాగ్ని సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ కూడా ఇవ్వబోతుంది. మరి ఈ బ్యూటీ అక్కడ కూడా గోల్డెన్ లెగ్ అనిపించుకుంటుందో లేదో చూడాలి.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.