Ritika Singh: హీరోయిన్ పై రిపొర్టర్స్ ఫైర్.. స్టేజ్ పైనే క్షమాపణలు చెప్పిన రితికా సింగ్.. ఏం జరిగిందంటే..

|

Mar 03, 2023 | 9:10 AM

తెలుగులో తక్కువ సినిమాల్లో నటించిన రితికా.. తమిళంలో వరుస సినిమాలు చేశారు. ప్రస్తుతం ఆమె నటించిన ఇన్ కారు సినిమా విడుదలకు సిద్ధమయ్యింది. ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రమోషన్లలో బిజీగా గడుపుతున్నారు రితికా.

Ritika Singh: హీరోయిన్ పై రిపొర్టర్స్ ఫైర్.. స్టేజ్ పైనే క్షమాపణలు చెప్పిన రితికా సింగ్.. ఏం జరిగిందంటే..
Ritika Singh
Follow us on

తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు హీరోయిన్ రితికా సింగ్. విక్టరీ వెంకటేశ్ నటించిన గురు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ హీరోయిన్.. తొలి చిత్రంతోనే నటనపరంగా ప్రశంసలు అందుకుంది. కేవలం కథానాయికగా మాత్రమే కాదు.. రితికా బాక్సింగ్ ఛాంపియన్ కూడా. బాక్సింగ్ నేపథ్యంలో వచ్చిన ఇరుది చుట్రు సినిమాలో కూడా ఆమె ప్రధాన పాత్రలో నటించారు. తెలుగులో తక్కువ సినిమాల్లో నటించిన రితికా.. తమిళంలో వరుస సినిమాలు చేశారు. ప్రస్తుతం ఆమె నటించిన ఇన్ కారు సినిమా విడుదలకు సిద్ధమయ్యింది. ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రమోషన్లలో బిజీగా గడుపుతున్నారు రితికా.

అయితే ఇటీవల ఈ సినిమా ప్రచార కార్యక్రమాల్లో భాగంగా రితికాకు చేదు అనుభవం ఎదురైంది. ముందుగా చెప్పిన సమయం కంటే ఏకంగా మూడు గంటలు ఆలస్యంగా రావడంతో మీడియా ప్రతినిధులు ఆమెపై ఫైర్ అయ్యారు. మీడియా సమావేశానికి మూడు గంటలు ఆలస్యంగా వస్తారా ? అంటూ సీరియస్ అయ్యారు. దీంతో రిపొర్టర్లకు వివరణ ఇచ్చుకుంది రితికా. తాను కావాలని ఆలస్యంగా రాలేదని.. మిస్ కమ్యూనికేషన్ కారణంగానే లేట్ అయ్యిందంటూ చెప్పుకొచ్చారు.

అలాగే మిస్ కమ్యూనికేషన్ కారణంగా ఆలస్యం అయ్యిందని.. అందుకు స్టేజి మీదనుంచే మీడియా ప్రతినిధులకు క్షమాపణలు చెప్పారు. దీంతో శాంతించిన వారు మీటింగ్ ను కొనసాగించారు. ప్రస్తుతం రితికా ఇన్ కార్ మాత్రమే కాకుండా.. పిచ్చకారెన్ 2, వనంగ ముడి, కొలై, కింగ్ ఆఫ్ కొత సినిమాల్లో నటిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.