AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Manchu Manoj: పెళ్లికి వేళాయే.. ఇవాళే మంచువారబ్బాయి వివాహ వేడుక..

మహా మంత్ర పూజతో మనోజ్ పెళ్లి వేడుకలను ప్రారంభించిన మంచు లక్ష్మీ.. మనోజ్ పెళ్లి బాధ్యతను తనపై వేసుకొని దగ్గరుండి అన్ని పనులు చూసుకుంటున్నారట.

Manchu Manoj: పెళ్లికి వేళాయే.. ఇవాళే మంచువారబ్బాయి వివాహ వేడుక..
Manchu Manoj
Rajitha Chanti
|

Updated on: Mar 03, 2023 | 8:19 AM

Share

మంచు వారింట పెళ్లి సందడి మొదలైంది. కొంతకాలంగా మంచు మనోజ్‌ పెళ్లిపై అనేక వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. భూమా మౌనిక రెడ్డిని మనోజ్‌ రెండో పెళ్లి చేసుకోబోతున్నాడని జోరుగా ప్రచారం జరుగుతోంది.. ఈ ప్రచారాన్నే వాళ్లు నిజం చేస్తున్నారు. శుక్రవారం రాత్రి మంచు లక్ష్మి ఇంట్లో వీళ్లిద్దరూ పెళ్లి బంధంతో ఒక్కటి కానున్నారు. ఇప్పటికే మెహందీ కార్యక్రమాలు ఘనంగా జరగ్గా గురువారం సంగీత్‌ను సెలెబ్రేట్‌ చేసుకున్నారు. ఈ ఫంక్షన్‌కు సంబంధించి మెహందీతో పాటు డెకరేషన్ పిక్స్ షేర్ చేసింది మంచు లక్ష్మి..దీంతో, మనోజ్‌ రెండోపెళ్లి వార్తలపై క్లారిటీ వచ్చినట్లయ్యింది.

మహా మంత్ర పూజతో మనోజ్ పెళ్లి వేడుకలను ప్రారంభించిన మంచు లక్ష్మీ.. మనోజ్ పెళ్లి బాధ్యతను తనపై వేసుకొని దగ్గరుండి అన్ని పనులు చూసుకుంటున్నారట. ఈ పెళ్లి ఇరు కుటుంబాల ముఖ్యులు..అతికొద్దిమంది సన్నిహితుల సమక్షంలో జరగనుంది. గత కొన్ని రోజులుగా మంచు మనోజ్ రెండో పెళ్లికి సంబంధించిన విషయాలు జనాల్లో డిస్కషన్ పాయింట్ అయిన సంగతి తెలిసిందే. భూమా మౌనిక రెడ్డిని మంచు మనోజ్ రెండో పెళ్లి చేసుకుంటున్నాడని బోలెడన్ని వార్తలు వచ్చాయి.

మంచు మనోజ్, మౌనికా రెడ్డి ఇద్దరికీ కూడా ఇది రెండో వివాహం కావడం విశేషం. మొదటి భార్యతో విడాకులు తీసుకున్న మనోజ్..భూమా మౌనిక రెడ్డితో ఎప్పటినుంచో క్లోజ్ గా ఉంటున్నారు..ఇప్పుడు ఆమెనే పెళ్లాడబోతున్నారు. చాలా కాలంగా మౌనికా రెడ్డి..మంచు మనోజ్ లవ్‌ ట్రాక్‌లో ఉన్నారని టాక్. గతంలో మౌనిక రెడ్డి మొదటి పెళ్లికి మంచు మనోజ్ కూడా హాజరయ్యారనే ప్రచారం జరిగింది. అయితే అటు మనోజ్, ఇటు మౌనిక రెడ్డి వైవాహిక జీవితాలు సాఫీగా సాగకపోవడంతో డివోర్స్ తీసుకున్నారని, ఆ క్రమంలోనే ఇప్పుడు ఈ ఇద్దరు పెళ్లిపీటలెక్కుతున్నట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

హైదరాబాద్ కి చెందిన ప్రణతి రెడ్డిని 2015 లో పెళ్లి చేసుకున్న మంచు మనోజ్.. నాలుగేళ్ల తర్వాత ఆమెతో 2019లో డివోర్స్ తీసుకున్నారు. వ్యక్తిగత కారణాల వల్ల పరస్పర అంగీకారంతో మంచు మనోజ్ విడాకులు తీసుకున్నట్లు చెప్పుకున్నారు. ఆ తర్వాత, చాన్నాళ్లకు మనోజ్‌ మౌనిక పబ్లిక్‌గా కనిపించారు. గతేడాది సీతాఫల్‌మండి వినాయకుడి విగ్రహం దగ్గర తళుక్కుమన్నారు. అప్పటి నుంచీ వీరి పెళ్లి గురించి అనేకసార్లు ఎన్నో గాసిప్స్‌ వచ్చాయి. పలు సందర్భాల్లో ఈ విషయంపై మంచు లక్ష్మిని మీడియా ప్రశ్నించగా..ఆమె ఓపెన్‌ అవ్వలేదు..ఇప్పుడు ఆ రూమర్లనే నిజం చేస్తూ..మార్చి 3న శుక్రవారం రాత్రి మంచు మనోజ్- భూమా మౌనిక రెడ్డి పెళ్లి జరగబోతోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ప్లాన్ ఏ తస్సుమందని, ప్లాన్ బీతో వచ్చాం.. అయినా దంచేశాడయ్యా..!
ప్లాన్ ఏ తస్సుమందని, ప్లాన్ బీతో వచ్చాం.. అయినా దంచేశాడయ్యా..!
ఫ్లిప్‌కార్ట్‌లో బ్రాండెడ్ ఏసీలు సగం ధరకే.. అద్భుతమైన ఆఫర్లు!
ఫ్లిప్‌కార్ట్‌లో బ్రాండెడ్ ఏసీలు సగం ధరకే.. అద్భుతమైన ఆఫర్లు!
అమరావతికి రైలు కనెక్టివిటీకి సంబంధించి లేటెస్ట్ అప్‌డేట్స్..
అమరావతికి రైలు కనెక్టివిటీకి సంబంధించి లేటెస్ట్ అప్‌డేట్స్..
నవరాత్రి వ్రతంలో సైంధవ లవణం వాడొచ్చా? ఉపవాసంలో ఉప్పు వాడే ముందు..
నవరాత్రి వ్రతంలో సైంధవ లవణం వాడొచ్చా? ఉపవాసంలో ఉప్పు వాడే ముందు..
నవరాత్రులు స్పెషల్.. అమ్మ వారికీ కచ్చితంగా పెట్టాల్సిన నైవేద్యం
నవరాత్రులు స్పెషల్.. అమ్మ వారికీ కచ్చితంగా పెట్టాల్సిన నైవేద్యం
శ్రీశైలం ప్రాజెక్టుకు అరుదైన ఘనత.. బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం
శ్రీశైలం ప్రాజెక్టుకు అరుదైన ఘనత.. బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం
ఓటీటీని వణికిస్తున్న వెబ్ సిరీస్.. ఒంటరిగా అస్సలు చూడకండి..
ఓటీటీని వణికిస్తున్న వెబ్ సిరీస్.. ఒంటరిగా అస్సలు చూడకండి..
బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర
బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర
సాఫ్ట్‌వేర్ జాబ్ వదిలేసి ఇండస్ట్రీలోకి.. ఇప్పుడేమో బిగ్‌బాస్10లో.
సాఫ్ట్‌వేర్ జాబ్ వదిలేసి ఇండస్ట్రీలోకి.. ఇప్పుడేమో బిగ్‌బాస్10లో.
ఫౌజీ షూట్ అప్‌డేట్.. ఎంతైంది.. ఎంత మిగిలింది..?
ఫౌజీ షూట్ అప్‌డేట్.. ఎంతైంది.. ఎంత మిగిలింది..?