బుర్రపాడు ట్విస్ట్..! ఈ క్రేజీ బ్యూటీ దాసరి నారాయణరావు మనవరాలా..!! తెలుగులో తోప్ హీరోయిన్

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఆయన ఓ ధ్రువ తార.. ఎందరో దర్శకులకు ఆయన మార్గదర్శి. ఆయనే దర్శక రత్న.. దర్శక దిగ్గజం దాసరి నారాయణ రావు. దర్శకుడిగా నటుడిగా తెలుగు సినిమా పై తనదైన ముద్రను వేశారు దాసరి. కమర్షియల్ సినిమాలనే కాదు విప్లవ జ్వాలను రగిలించే సినిమాలు తీయడంలోనూ దాసరి దిట్ట.

బుర్రపాడు ట్విస్ట్..! ఈ క్రేజీ బ్యూటీ దాసరి నారాయణరావు మనవరాలా..!! తెలుగులో తోప్ హీరోయిన్
Dasari Narayana Rao

Updated on: Jan 03, 2026 | 10:42 AM

దాసరి నారాయణరావు.. తెలుగు సినీ చరిత్రలో చెరిగిపోని ముద్ర వేశారు దాసరి. దర్శకుడిగా, నిర్మాతగా, నటుడిగా ఎన్నో విజయవంతమైన సినిమాలతో మెప్పించారు. ఎక్కువ సినిమాలు తీసిన దర్శకుడిగా గిన్నిస్‌ రికార్డులో కూడా స్థానం సంపాదించుకున్నారు దాసరి. సినిమాలతో పాటు రాజకీయాల్లోనూ రాణించి ఎన్నో మైలు రాళ్లను అధిగమించారు. ఆయన దాదాపు 150 చిత్రాలకు దర్శకత్వం వహించారు. 53 సినిమాలు స్వయంగా నిర్మించారు. అలాగే దాసరి 250 పైగా చిత్రాలలో సంభాషణ రచయితగా, గీతరచయితగా పనిచేశారు. మామగారు, సూరిగాడు , ఒసేయ్ రాములమ్మా చిత్రాలు దాసరి నటనా కౌశలానికి మచ్చుతునకలు. తెలుగు , కన్నడ సినిమాల్లో నటుడిగాను గుర్తింపు పొందిన ఆయన ఉత్తమ నటునిగా బహుమతి కూడా పొందారు

దాసరి సినిమాల్లో తాతా మనవడు, స్వర్గం నరకం, మేఘసందేశం, మామగారు వంటి సినిమాలు ఆయనకు అనేక అవార్డులు తెచ్చిపెట్టాయి. నా అన్నవాళ్లను అక్కున చేర్చుకుని వారికి ఉపాధి కల్పించారు దాసరి. వందలాది మంది ఆర్టిస్టుల్ని టెక్నీషియన్లను పరిశ్రమకు పరిచయం చేసిన గొప్ప వ్యక్తి దాసరి. తెలుగు సినిమా పరిశ్రమకు పెద్ద దిక్కుగా ఉన్న దాసరి నారాయణ రావు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ 2017 మే 30న తుది శ్వాస విడిచారు. అయితే ఆయన మనవరాలు ఇప్పుడు టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ అని మీకు తెలుసా.? ఆమె ఎవరంటే..

ఇవి కూడా చదవండి

డింపుల్ హయతి.. తెలుగులో వరుసగా సినిమాలు చేస్తూ.. దూసుకుపోతుంది ఈ భామ. హీరోయిన్ గానే చేస్తూ స్పెషల్ సాంగ్ లోనూ మెప్పించింది. గల్ఫ్ అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. ఆతర్వాత గద్దల కొండ గణేష్ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసింది. ఆతర్వాత ఖిలాడీ, రామబాణం సినిమాల్లో నటించింది. ఇప్పుడు రవితేజతో కలిసి బార్థమహాశయులకు విజ్ఞప్తి అనే సినిమా చేస్తుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన తాతగారు దాసరి నారాయణరావు గారని, నానమ్మ అలనాటి ప్రముఖ నటి ప్రభ గారని తెలిపింది. ఈ విషయం చాలా మందికి తెలియదని చెప్పుకొచ్చింది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి.