బిగ్ బాస్ గేమ్ షోకు ఎంతటి పాపులారిటీ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే వివిధ భాషల్లో బిగ్ బాస్ షో టెలికాస్ట్ అవుతున్న విషయం తెలిసిందే. తెలుగులోనూ ఇప్పటికే ఆరు సీజన్స్ పూర్తి చేసుకున్న బిగ్ బాస్ ఇప్పుడు 7 సీజన్ రన్ అవుతోంది. నాగార్జున హోస్ట్ గా ఈ సీజన్ రన్ అవుతోంది. ఇప్పటికే 8 వారాలు పూర్తి చేసుకుంది కూడా బిగ్ బాస్ 7. అయితే బిగ్ బాస్ షో పై ఎంత పాజిటివ్ ఉంటుందో.. అలాగే విమర్శలు కూడా వచ్చాయి. ఇప్పటికే చాలా మంది బిగ్ బాస్ పై చాలా విమర్శలు చేశారు. కొంతమంది బిగ్ బాస్ షోను నిలిపివేయాలంటూ కోర్టుకు కూడా వెళ్లారు. ఇక బిగ్ బాస్ లో పాటిస్పేట్ చేసిన వాళ్ళు కూడా బయటకు వచ్చి షాకింగ్ కామెంట్స్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇదిలా ఉంటే తాజాగా ఓ హీరోయిన్ బిగ్ బాస్ ఓ చెత్త షో అంటూ సంచలన కామెంట్స్ చేసింది.
అల్లు అర్జున్ హీరోగా నటించిన వరుడు సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది భాను శ్రీ. గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తాకొట్టింది. దాంతో భాను శ్రీకి సినిమా ఆఫర్స్ తక్కువయ్యాయి. ఆతర్వాత చిన్న చిన్న పాత్రల్లో కనిపించింది భాను శ్రీ.
ఇక భాను శ్రీ తాజాగా సోషల్ మీడియాలో బిగ్ బాస్ షోను ఉద్దేశిస్తూ ఓ పోస్ట్ షేర్ చేసింది. ఈ పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. తాజాగా ఆమె సోషల్ మీడియాలో ఇలా రాసుకొచ్చింది. ‘బిగ్‌బాస్ షోని ప్రేక్షకులు ఎలా చూస్తున్నారా..? అని నేను ఇప్పటికీ ఆశ్చర్యపోతుంటాను. అంతే కాదు ఎప్పటికప్పడు కొత్త సీజన్స్ కూడా వస్తూనే ఉన్నాయి. నా దృష్టిలో ఇది ఓ చెత్త షో. నా ఇన్‌స్టా ఫీడ్ అంతా కూడా బిగ్‌బాస్ కు సంబంధించిన వీడియోలతో నిండిపోతోంది’ అని రాసుకొచ్చింది భాను శ్రీ.
I’ve always wondered how people watch Big Boss and why new seasons keep coming up. In my opinion, it’s the most mind-numbing thing on TV. My Instagram feed is bombarded with such cringe worthy highlights from the show !#bigboss #cringoverload
— Bhanushree Mehra (@IAmBhanuShree) October 30, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..