Suriya Injury: షూటింగ్‌లో హీరో సూర్యకు ప్రమాదం.. ఆసుపత్రికి తరలింపు

Suriya Injury: తమిళ్ హీరో సూర్యకు ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. షూటింగ్ సమయంలో ప్రమాదం జరగడంతో ఆయనకు గాయాలయ్యాయి. వెంటనే అప్రమత్తం అయిన చిత్రయూనిట్ గాయపడిన సూర్యను స్థానిక ఆసుపత్రికి తరలించారని తెలుస్తోంది. సూర్య ప్రస్తుతం కంగువ అనే సినిమా చేస్తున్నారు.

Suriya Injury: షూటింగ్‌లో హీరో సూర్యకు ప్రమాదం.. ఆసుపత్రికి తరలింపు
Surya

Updated on: Nov 23, 2023 | 1:22 PM

తమిళ్ హీరో సూర్యకు ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. షూటింగ్ సమయంలో ప్రమాదం జరగడంతో ఆయనకు గాయాలయ్యాయి. వెంటనే అప్రమత్తం అయిన చిత్రయూనిట్ గాయపడిన సూర్యను స్థానిక ఆసుపత్రికి తరలించారని తెలుస్తోంది. సూర్య ప్రస్తుతం కంగువ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ చెన్నైలో జరుగుతుంది. షూటింగ్ లో భాగంగా ఓ సన్నివేశం చిత్రీకరిస్తుండగా కెమెరా ఆయన మీద పడిందని సమాచారం. కెమెరా మీదపడటంతో సూర్య భుజానికి గాయం అయ్యింది.

సూర్య కు తమిళ్ తో పాటు తెలుగులోనూ మంచి క్రేజ్ ఉంది. ఆయన సినిమాలకు టాలీవుడ్ లో మంచి మార్కెట్ ఉంది. దాంతో సూర్య నటించిన ప్రతి సినిమా తెలుగులోనూ డబ్ అవుతూ ఉంటుంది. ప్రస్తుతం సూర్య కంగువ అనే సినిమా చేస్తున్నాడు. యాక్షన్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న శివ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.

హిస్టారికల్ స్టోరీతో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ దిశాపటాని హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే ఈ సినిమాను ఏకంగా 38 భాషల్లో రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు హైలైట్ గా ఉండనున్నాయి. ఇప్పటికే ఈ సినిమానుంచి రిలీజ్ అయిన పోస్టర్లు, గ్లింప్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. కంగువ సినిమాను 38 భాషల్లో 3డి, ఐమాక్స్ టెక్నాలజీలో విడుదల చేయనున్నట్టు మేకర్స్ తెలిపారు. ఇప్పుడు సూర్యకు గాయం కావడంతో షూటింగ్ ఆలస్యం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.