Suriya Sivakumar: హ్యాట్రిక్ హిట్స్‌తో ట్రాక్ లోకి వచ్చిన కోలీవుడ్ స్టార్ హీరో.. ఫుల్ జోష్ లో ఫ్యాన్స్

రెండు సినిమాలు బ్యాక్‌టుబ్యాక్ ఓటీటీకిచ్చేసినా.. బిగ్‌ స్క్రీన్స్‌పై హవా చాటుకుంటూనే వున్నారు హీరో సూర్య. తన మార్కెట్‌ రేంజ్‌లో మార్పుల్లేవని ఢంకా భజాయించి చెబుతున్నారు.

Suriya Sivakumar: హ్యాట్రిక్ హిట్స్‌తో ట్రాక్ లోకి వచ్చిన కోలీవుడ్ స్టార్ హీరో.. ఫుల్ జోష్ లో ఫ్యాన్స్
Surya

Updated on: Mar 18, 2022 | 7:47 PM

Suriya Sivakumar: రెండు సినిమాలు బ్యాక్‌టుబ్యాక్ ఓటీటీకిచ్చేసినా.. బిగ్‌ స్క్రీన్స్‌పై హవా చాటుకుంటూనే వున్నారు హీరో సూర్య. తన మార్కెట్‌ రేంజ్‌లో మార్పుల్లేవని ఢంకా భజాయించి చెబుతున్నారు. నాటోన్లీ క్వాంటిటీ… క్వాలిటీలో కూడా అయ్యామ్‌ ది బెస్ట్ అనే క్రెడిట్ తెచ్చుకుంటున్నారు కోలీవుడ్‌ స్టార్.  ఎవ్వరికీ తలవొంచడు…! సూర్య ఒరిజినల్‌ మేనరిజంలాగే వుంది సూర్య లేటెస్ట్ మూవీ. కమర్షియల్‌ ఫార్ములాతో కూడిన పర్ఫెక్ట్ మెసేజ్ ఓరియంటెడ్ సినిమాగా పాజిటివ్‌ వైబ్స్ క్రియేటౌతున్నాయి. ఆడపిల్లల జీవితాలతో ఆడుకునే పురుగుల్ని ఏరిపారేసే లాయర్‌ పాత్రలో నటించారు సూర్య.

సొసైటీలోని ఒక సెన్సిటివ్ ఇష్యూని కమర్షియల్ యాంగిల్‌లో సక్సెస్‌ఫుల్‌గా హ్యాండిల్ చేశారు డైరెక్టర్ పాండిరాజ్. సూర్య హీరోయిజాన్ని తెలుగు ఆడియన్స్‌ కూడా కనెక్ట్‌ అయ్యేలా డిజైన్ చేశారు. టోటల్‌గా పైసావసూల్ మూవీ అనేది ఈటీ మీద వినిపిస్తున్న ఇండస్ట్రీ టాక్. డిజిటల్‌లో రెండు బ్లాక్‌బస్టర్లు రిజిస్టర్ చేసుకున్న తర్వాత థియేటర్లో రిలీజైన తొలి సూర్య సినిమా ఇది. ఆకాశం నీ హద్దురా అండ్ జైభీమ్… రెండూ ఆస్కార్‌ అంచుల్ని తాకిన గొప్ప సినిమాలే. డిజిటల్‌ స్క్రీన్స్‌కి వెంటవెంటనే సినిమాలు ధారాదత్తం చేయడంతో సూర్యకు థియేటర్ బిజినెస్ డల్ అయ్యే ప్రమాదం వుందన్నది నిన్నటివరకూ కోలీవుడ్‌లో టాక్ నడిచింది. కానీ.. లేటెస్ట్ మూవీ ఈటీకి పాజిటివ్ టాక్ రావడంతో.. సూర్య బిగ్‌స్క్రీన్స్‌పై కూడా బౌన్స్‌బ్యాక్ కావడం గ్యారంటీ అని క్లియరైపోయింది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Kashmir Files: కశ్మీర్‌ ఫైల్స్‌ చిత్ర దర్శకుడికి భద్రత పెంపు.. వై క్యాటగిరీ కల్పిస్తూ అధికారుల నిర్ణయం..

Prabhas: మారుతి సినిమాకు ప్రభాస్‌ అన్ని కోట్లు తీసుకుంటున్నారా.? రోజుకు ఏకంగా కోటి రూపాయల పైమాటే..

Bheemla Nayak Aha: ఆహాలో పవర్ స్ట్రోమ్.. స్ట్రీమింగ్‏కు సిద్ధమైన బ్లాక్ బస్టర్ భీమ్లా నాయక్..