అదీ ఉండాలి.. ఇదీ ఉండాలి..! హీరోగా విలన్‌గా మెప్పిస్తున్న స్టార్స్ వీరే..

నటనకు ప్రాధాన్యత ఉంటే చాలు విలన్స్ గాను నటించి మెప్పిస్తున్నారు కొందరు హీరోలు. చాలా మంది హీరోలు విలన్ పాత్రలు చేసి అందరి దృష్టిని ఆకర్షించడం మనం మనం చూస్తున్నాం. ఈ వరుసలో కిచ్చా సుదీప్, సూర్య సహా చాలా మంది హీరోలు ఉన్నారు.

అదీ ఉండాలి.. ఇదీ ఉండాలి..! హీరోగా విలన్‌గా మెప్పిస్తున్న స్టార్స్ వీరే..
Movie News
Follow us

|

Updated on: Oct 02, 2024 | 12:41 PM

సినిమా ఇండస్ట్రీలో హీరో పాత్రలు, విలన్ పాత్రలు అంటూ తేడా చూడటం లేదు. నటనకు ప్రాధాన్యత ఉంటే చాలు విలన్స్ గాను నటించి మెప్పిస్తున్నారు కొందరు హీరోలు. చాలా మంది హీరోలు విలన్ పాత్రలు చేసి అందరి దృష్టిని ఆకర్షించడం మనం మనం చూస్తున్నాం. ఈ వరుసలో కిచ్చా సుదీప్, సూర్య సహా చాలా మంది హీరోలు ఉన్నారు. ముందుగా హీరోగా కిచ్చా సుదీప్ గురించి మాట్లాడుకోవాలి.

కిచ్చా సుదీప్

దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన  ఈగ సినిమాలో విలన్ గా నటించి మెప్పించాడు సుదీప్. 2012లో వచ్చిన ఈ సినిమాలో నాని, సమంత, సుదీప్ నటించారు. అప్పటి వరకు సుదీప్ హీరోగా మాత్రమే నటించాడు. ‘ఈగ’ సినిమాలో విలన్‌గా అద్భుతంగా నటించి మెప్పించాడు సుదీప్. ఆయన చేసిన ఈ విలన్ పాత్ర అందరి దృష్టిని ఆకర్షించింది.

సూర్య

ఆతర్వాత ఆ రేంజ్ లో విలన్ పాత్రకి కిక్ ఇచ్చిన నటుడు సూర్య. స్టార్ హీరో సూర్య సినిమాలకు ఉండే క్రేజ్ గురించి ప్ర్తయేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ‘విక్రమ్’ సినిమా క్లైమాక్స్‌లో కొన్ని నిమిషాలు మాత్రమే సూర్య కనిపిస్తారు.  అయితే విలన్‌గా అందరి దృష్టిని ఆకర్షించాడు. ‘విక్రమ్’ సినిమా సీక్వెల్‌లో విలన్‌గా నటించి హైలైట్‌  అవ్వనున్నాడని టాక్ వినిపిస్తుంది.  ఇక విక్రమ్ సినిమాలో కమల్ హాసన్ హీరోగా నటించిన విషయం తెలిసిందే.

ఇది కూడా చదవండి : Devara : దేవరలో నటించిన ఈమె గుర్తుందా.? బయట చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే

ఫహద్ ఫాసిల్

ఫహద్ ఫాసిల్ పాత్ర ‘పుష్ప’ చిత్రానికి హైలైట్. సినిమా మొత్తానికి అతనే విలన్. పోలీస్ గెటప్ లో  నెగెటివ్ షేడ్ ఉన్న పాత్ర చేసి మెప్పించారు  ఫహద్.  దీంతో ఆయన అందరి దృష్టిని ఆకర్షించారు. ‘పుష్ప 2’ డిసెంబర్‌లో విడుదల కానుంది. ఈ సినిమాలోనూ విలన్‌గా అదరగొట్టనున్నాడు ఫహద్.

ఇది కూడా చదవండి :బాబోయ్..! భరణి సినిమా హీరోయిన్ ఎంత మారిపోయింది.. కుర్రహీరోయిన్స్ కూడా కుళ్ళుకోవాల్సిందే

విజయ్ సేతుపతి

హీరోగా విజయ్ సేతుపతి ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. ఓ వైపు హీరోగా చేస్తూనే మరో వైపు విలన్ గా చేస్తున్నారువిజయ్ సేతుపతి.  తెలుగులో ఉప్పెన సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించారు విజయ్. అలాగే దళపతి విజయ్ నటించిన ‘మాస్టర్’లో భవాని అనే విలన్‌గా నటించి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈ సినిమాలో ఆయన పాత్రకు ప్రశంసలు దక్కాయి. ఇలా మరికొంతమంది విలన్ పాత్రలు చేసిన హీరోలు ఉన్నారు.

ఇది కూడా చదవండి : నాన్న స్టార్ హీరో, అమ్మ సీనియర్ హీరోయిన్.. కానీ ఈ అక్కాచెల్లెళ్లకు మాత్రం ఒక్క హిట్ లేదు

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి