హీరో శివకార్తికేయన్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే.. తమిళ్ లో హీరోగా రాణిస్తున్న శివ కార్తికేయన్. రెమో, వరుణ్ డాక్టర్, డాన్ లాంటి సినిమాలతో ఆకట్టుకున్నాడు. ఇటీవలే ప్రిన్స్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. తెలుగు దర్శకుడు అనుదీప్ దర్శకత్వం వహించిన ప్రిన్స్ సినిమా తెలుగుతో పాటు తమిళ్ లోనూ రిలీజ్ అయ్యింది. తెలుగులో ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయినా కూడా తమిళ్ ప్రేక్షకులను మెప్పించింది. శివ కార్తికేయన్ యాంకర్ నుంచి హీరోగా ఎదిగాడు. ఆ తర్వాత ఇప్పుడు ప్రొడ్యూసర్ గా ను మారారు. శివ కార్తికేయన్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే. సోషల్ మీడియాలో కూడా శివకార్తికేయన్ ను ఎక్కువ మంది ఫాలో అవుతూ ఉంటారు.
ప్రస్తుతం మహావీరన్ అనే సినిమాను కూడా తెలుగులో రిలీజ్ చేయనున్నారు. ఇక హీరోగా.. ప్రొడ్యూసర్ గా బిజీ బిజీగా ఉన్న శివకార్తికేయన్. సోషల్ మీడియా లో చాలా యాక్టివ్ గా ఉంటారు. తన సినిమా విషయాలతో పాటు.. వ్యక్తిగత విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటూ ఉంటాడు. తాజాగా అభిమానులకు షాక్ ఇచ్చాడు.
కొంతకాలం సోషల్ మీడియా బ్రేక్ ఇవ్వనున్నట్టు ప్రకటించాడు శివకార్తికేయన్. ‘మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. నేను కొద్ది రోజుల పాటు సోషల్ మీడియా నుంచి బ్రేక్ తీసుకుంటున్నా. సినిమా అప్‌డేట్స్ నా టీమ్ షేర్ చేస్తుంది. త్వరలోనే తిరిగి వచ్చేస్తాను’ అని పేర్కొన్నారు శివకార్తికేయన్. ఈ విషయాన్నీ ట్విట్టర్ లో షేర్ చేశారు శివకార్తికేయన్.
My dear brothers and sisters,
I am taking a break from twitter for a while.
Take care, and i will be back soon ??P.S: All updates on the films will be shared here by my team. pic.twitter.com/Nf4fdqXRTy
— Sivakarthikeyan (@Siva_Kartikeyan) April 30, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..