మాట్లాడుతూ ఎమోషనల్.. స్టేజ్ పైనే కన్నీళ్లు పెట్టుకున్న హీరో సిద్ధార్థ్.. కారణం ఏంటంటే

‘బొమ్మరిల్లు’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు హీరో సిద్ధార్థ్‌. ఈ సినిమాలో తనదైన నటనతో ఆకట్టుకున్న సిద్ధార్థ్‌ యూత్‌లో మంచి క్రేజ్‌ సంపాదించుకున్నాడు. ముఖ్యంగా ఈ ఒక్క సినిమాతో లేడీ ఫ్యాన్స్‌ను సంపాదించుకున్నాడీ హీరో. అనంతరం ‘ఆట’, ‘కొంచెం ఇష్టం కొంచెం కష్టం’, ‘బావ’ వంటి వరుస సినిమాలతో తెలుగు హీరోగా మారాడీ తమిళ స్టార్‌

మాట్లాడుతూ ఎమోషనల్.. స్టేజ్ పైనే కన్నీళ్లు పెట్టుకున్న హీరో సిద్ధార్థ్.. కారణం ఏంటంటే
Hero Siddharth

Updated on: Jun 27, 2025 | 4:28 PM

నువ్వొస్తానంటే నేనొద్దంటానా’, ‘బొమ్మరిల్లు’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకున్న చార్మింగ్ హీరో సిద్ధార్థ్. తెలుగు, తమిళ్ భాషల్లో సినిమాలు చేస్తూ సిద్ధార్థ్ ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు’. ఒకప్పుడు లవర్ బాయ్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు సిద్ధార్థ్. ఆతర్వాత వరుసగా లవ్ స్టోరీస్ చేస్తూ తక్కువ అసమయంలోనే స్టార్ హీరోగా ఎదిగాడు సిద్ధార్థ్. ప్రస్తుతం సిద్ధార్థ్ సినిమాల స్పీడ్ తగ్గించాడు. కెరీర్ పీక్ లో ఉండగానే సిద్ధార్థ్ కు కొన్ని డిజాస్టర్స్ పలకరించాయి. దాంతో సిద్ధార్థ్ సినిమాల జోరు తగ్గింది. ఇటీవల ఈ టాలెంటెడ్ హీరో విభిన్నమైన కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తున్నాడు. చివరిగా చిన్న అనే సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు సిద్ధార్థ్.

ఇది కూడా చదవండి : కుబేర సినిమాలో అమ్మ పాట పాడింది ఈవిడే.. ఆమె గొంతులోనే ఎదో మాయ ఉంది..

ఇక ఇప్పుడు 3 BHK అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా సిద్ధార్థ్ కెరీర్‌లో 40వ సినిమా.. కుటుంబ కథ చిత్రంగా ఈ సినిమా తెరకెక్కుతుంది. తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ సినిమాను తమిళ్, తెలుగు భాషల్లో విడుదల చేయనున్నారు. ఇక తాజాగా విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను మెప్పిస్తుంది. కాగా ఈ సినిమా ట్రైలర్ విడుదల సందర్భంగా సిద్ధార్థ్ ఎమోషనల్ అయ్యారు. స్టేజ్ పైనే కన్నీళ్లు పెట్టుకున్నాడు. తన తల్లి దండ్రులు కూడా 3 BHKలో ఉండేవారు అంటూ ఎమోషనల్ అయ్యాడు సిద్ధార్థ్.

ఇది కూడా చదవండి :హిట్ కొట్టి ఆరేళ్ళు.. మూడు సినిమాలు చేస్తే ఒకే ఒక్క హిట్.. కానీ క్రేజ్ మాత్రం పీక్

సిద్ధార్థ్ మాట్లాడుతూ.. 3 BHK  అనే సినిమా చేస్తున్నా అని చెప్పగానే మా నాన్న కళ్ళల్లో సంతోషం కనిపించింది. ఆయన ముఖంలో తృప్తి, ఒకింత గర్వం కనిపించింది. ఈ సినిమాలో అందరూ నన్ను ఏడిపిస్తారు. ఇది ఒక ఎమోషనల్ డ్రామా.. ఇలాంటి సినిమా చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నా తల్లిదండ్రులు నన్ను ఎంతగానో నమ్మారు. నేను బాగుండాలని, నా భవిష్యత్ బాగుండాలని వారు సంపాదించిందంతా ఖర్చుపెట్టారు. నన్ను నమ్మి ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన డైరెక్టర్‌కు థాంక్యూ అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు సిద్ధార్థ్..

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి :ఈ అమ్మడు సోషల్ మీడియా బ్యూటీ కదా మావ.! ఎవరో గుర్తుపట్టారా..?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి